Monday, December 23, 2024

నల్లమల ప్రాంత ప్రజల ఆరోగ్య శ్రేయస్కరమే ఏకైక లక్షం

- Advertisement -
- Advertisement -

అచ్చంపేట: నల్లమల, అచ్చంపేట ప్రాంత ప్రజల ఆరోగ్య శ్రేయస్కారమే తన ఏకైక లక్షమని ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు అన్నారు. శుక్రవారం అచ్చంపేట పట్టణంలోని వంద పడకల ఆసుపత్రిని సందర్శించి వైద్య బృందంతో రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దకొత్తపల్లి మండలం మారేడుపల్లి గ్రామం నుంచి నల్లమల ప్రాంతంలోని అచ్చంపేట వంద పడకల ఆసుపత్రిలో మొదటి పేషెంట్ డయాలసిస్ చేయించుకోవడం సంతోషకరమని ఎమ్మెల్యే తెలిపారు. అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో టుబ్యాక్ టమీ ఆపరేషన్ చేసే విధంగా రేజ్వితో పాటు వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్‌తో మాట్లాడడం జరిగిందన్నారు.

ఇలాంటి ఆపరేషన్లకు శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి డాక్టర్లు ఆపరేషన్లు చేసే విధంగా కృషి చేస్తామని వైద్య విధాన పరిషత్ కమిషనర్ హామి ఇవ్వడం జరిగిందన్నారు. గతంలో ఆసుపత్రిలో గర్భవతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, 100 పడకల ఆసుపత్రి ద్వారా గర్భవతులకు ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో వైద్యం పొందుతున్నారని అన్నారు. అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ప్రతిపక్షాలను గాని చోటామోటా రాజకీయ నాయకులకు భయపడి విధులు నిర్వహించకుండా ప్రశాంతకరమైన వాతావరణంలో ప్రజలకు సేవ చేయాలని, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తమ దృష్టికి తీసుకురావాలని డాక్టర్లకు ఎమ్మెల్యే సూచించారు.

  • అచ్చంపేట ప్రాంతంలోని డయాలసిస్ -సెంటర్‌లో వేరే జిల్లాల పేషెంట్‌లు వచ్చి డయాలసిస్ చేయించుకోవడం ద్వారా తమ జీవితానికి సార్ధకత లభించిందన్నారు. ఉద్యమ సమయంలో అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రి ముందర వంద పడకల ఆసుపత్రి నిర్మించాలని ఆందోళన చేయడం జరిగిందని, ఆ కలను తమ హయాంలోనే పూర్తి హంగులు, ఆర్భాటాలతో అన్ని ఎక్విప్మెంట్స్ సమకూర్చుకుని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుతో ప్రారంభించుకోవడం సంతోషాన్నిచ్చిందన్నారు. వంద పడకల ఆసుపత్రి ద్వారా లోతట్టు ప్రాంతంలో జీవిస్తున్న చెంచులతో పాటు గిరిజనులకు ఎమర్జెన్సీ సేవలు చేయడానికి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు 24 గంటలు అందుబాటులో ఉంటారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వైద్య రంగంలో పల్లె దవాఖానాలతో పాటు బస్తీ దవాఖానాలతో పాటు వంద పడకల ఆసుపత్రి, మెడికల్ కళాశాల ఏర్పాటు చేసిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కిందన్నారు. అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో 9వ కాన్పు కోసం వచ్చిన మహిళను తొమ్మిదవ కాన్పు ఎందుకని ప్రశ్నించగా డాక్టర్లు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయడం లేదని ఆమె సమాధాన ఇవ్వడం ద్వారా డాక్టర్లు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసే విధంగా శ్రద్ధ వహించాలని ఆదేశించారు. అదే విధంగా అచ్చంపేట వైద్య ఆరోగ్య శాఖ దినోత్సవం పురస్కరించుకుని దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా వైద్య బృందం ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రభుత్వ డాక్టర్లను ఆదేశించారు.
  • అచ్చంపేట నియోజకవర్గంలో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఊరూరా చెరువు సంబరాలు లకా్ష్మపూర్ గ్రామంలో రైతులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఘనంగా జరుపుకోవడం తెలంగాణ రాష్ట్రంలో దశాబ్ది కాలంలో సాధించిన ప్రగతి కండ్ల ముందు కనిపిస్తుందని, తద్వారా ప్రజలు, రైతులు సంబరాల్లో మునిగి తేలాడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ ఎడ్ల నరసింహా గౌడ్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు పోకల మనోహర్, రంగాపూర్ సర్పంచ్ లోక్యా నాయక్, వైద్యులు ప్రభువు, తారాసింగ్, కృష్ణ, అచ్చంపేట పట్టణ అధ్యక్షుడు రమేష్, కౌన్సిలర్ రమేష్ రావు, సుంకరి నిర్మల బాలరాజు, నాయకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News