Friday, December 27, 2024

అచ్చంపేటను రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దడమే ఏకైక లక్షం

- Advertisement -
- Advertisement -
  • ప్రజాస్వామ్యంలో ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు
  • ప్రతిసారి నాన్ లోకల్ అనడం చట్టాలపై అవగాహన లేకపోవడమే
  • ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు

అచ్చంపేట: అచ్చంపేట పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచి పట్టణాన్ని రోల్ మోడల్‌గా తీర్చిదిద్దడమే లక్షమని, ప్రతిపక్షాలు ప్రతిసారి నాన్ లోకల్ అనడం వారికి చట్టాలపై అవగాహన లేకపోవడానికి నిదర్శనమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు.

బుధవారం అచ్చంపేట పట్టణంలోని 5, 6, 15, 16 వార్డులలో రూ. కోటి 90 లక్షల అభివృద్ధి పనులకు చైర్మెన్ ఎడ్ల నరసింహ గౌడ్, వార్డు కౌన్సిలర్లతో కలిసి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఉట్లకోనేరు వద్ద ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో రిజర్వేషన్ల ప్రక్రియ ద్వారా ఎక్కడి నుంచైనా పోటీ చేసి పరిపాలన అందించే విధంగా ఎవరైనా పోటీ చేయవచ్చని, కానీ అవగాహన లేకుండా నాన్ లోకల్ అని సంబోధించడం సరైంది కాదని, అచ్చంపేట ఎవరి జాగీర్ కాదని ఎమ్మెల్యే మండిపడ్డారు.

అచ్చంపేట ప్రాంతంలో మూడోసారి హ్యాట్రిక్ విజయం తథ్యమని, భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని ఎమ్మెల్యే అన్నారు. అయితే ప్రతిసారి వంద పడకల ఆసుపత్రిని టార్గెట్ చేస్తూ పూర్తిస్థాయి సిబ్బంది లేదని అవాస్తన ఆరోపణలు చేస్తూ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ప్రతిపక్ష నాయకుడికి అనుకూలంగా ఉన్న డాక్టర్లు ప్రైవేట్ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆయన విమర్శించారు. వారి పబ్బం గడుపుకోవడానికి నిరాధారణమైన ఆరోపణలు ఆసుపత్రిపై చేస్తున్నారని ఎమ్మెల్యే విమర్శించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు మనోహర్, మున్సిపల్ చైర్మెన్ ఎడ్ల నరసింహ గౌడ్, నాయకులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News