Monday, January 20, 2025

ఏప్రిల్ 15 వరకు ఓటు నమోదు చేసుకునేందుకు అవకాశం

- Advertisement -
- Advertisement -

మార్పులు చేర్పులకు అవకాశం కల్పించిన కేంద్ర ఎన్నికల సంఘం

మన తెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో 18 ఏళ్లు నిండిన అర్హతగల యువకులు ఏప్రిల్ 15 వరకు ఓటు హక్కు నమోదుకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఫిబ్రవరి నెలలో విడుదల చేసిన జాబితాలో పేరు లేనివారు దరఖాస్తు చేసేందుకు వీలు కల్పించింది. ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినవారు కూడా ఓటు నమోదు చేసుకోవచ్చని సూచిస్తోంది. కొత్తగా ఓటు నమోదు కోసం ఫారం- 8 దరఖాస్తును ఆన్‌లైన్‌లో కానీ నియోజకవర్గ ఎన్నికల అధికారికి అందజేయవచ్చు. ఎన్నికల సహాయ అధికారి, పోలింగ్ కేంద్రం అధికారికి కూడా ప్రత్యక్షంగా దరఖాస్తును అందజేయవచ్చు. వివరాలను కూడా మార్చుకునేందుకు అవకాశం ఉంటుందని పేర్కొంది. కాగా ఓటు నమోదు ప్రక్రియ ప్రతి సంవత్సరం కొనసాగుతూ ఉంటుంది. జనవరి, ఏప్రిల్, జులై, అక్టోబరు నెల 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వారు ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకునేందుకు ఎలక్షన్ కమిషన్ అవకాశం ఇస్తోంది. https://nvsp.in, https://ceotelangana.nic.in వెబ్‌సైట్‌లో ఓటు హక్కు నమోదు చేసుకోవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News