Thursday, January 23, 2025

ప్రజా బలం లేకనే అడ్డుదారులు వెతుకుంటున్న ప్రతిపక్షాలు

- Advertisement -
- Advertisement -

గద్వాల రూరల్: ప్రజాస్వామ్యం బద్దంగా ఎనుకున్న ఎమ్మెల్యేపై ప్రతిపక్షాలు అడ్డంకులు సృష్టిస్తున్నారని, ఎవరైన్నీ అడ్డంకులు సృష్టించిన చివరిగా అంతిమ విజయం వరించేంది బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికే అని ఎమ్మెల్యే సతీమణి బండ్ల జ్యోతి అన్నారు. శుక్రవారం గద్వాల మండలం అనంతపూర్ గ్రామంల్లో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తనయుడు బండ్ల సాయిసాకేత్‌రెడ్డి ఇం టింటి కృష్ణన్న ప్రచారం కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి బండ్లజ్యోతి పాల్గొన్నారు.

ఈ సందర్భం గా ఆమె మాట్లాడుతూ… 2018 అసెంబ్లీ ఎన్నికలలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి త ప్పుడు అఫిడవిట్ సమర్పించారంటూ మాజీ మం త్రి డీకే అరుణ హైకోర్టును ఆశ్రయించారని, దీంతో ఎమ్మెల్యేకు నోటీసులు ఇవ్వకుండా అనర్హత వేటు వేయించినట్లు, రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో ప్ర తిపక్ష నాయకులకు ప్రజలే బుద్ది చెబుతారని విమర్శించారు. గత ప్రభుత్వ పాలనలో నడిగడ్డ అభివృద్ధి నోచుకోక ఈ ప్రాంత ప్రజలు వలసలు వెళ్లారని, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో నడిగడ్డలో రిజర్వాయర్‌లు పూర్తి చేసి, వ్యవసాయానికి పుష్కలంగా సాగు నీరందించడంతో ఈ ప్రాంతం సస్యశ్యామలం కావడంతో వలసలు రూపుమాపాయని గుర్తు చేశారు.

సీఎం కేసీఆర్ సహకారంతో నడిగడ్డలో ప్రతి ఒక్కరికి అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందేలా నిరంతరం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని, ప్రజా ఆదరణ పొంది నిత్యం ప్రజల మద్య ఉంటున్న ఎమ్మెల్యేపై ప్రతిపక్ష నాయకులు ఆరోపణలు చేయడం హస్యాస్పదంగా ఉందన్నారు. గత ప్రభుత్వ పాలన లో చేసిన అభివృద్ధిని, నేటి బీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో చేసిన అభివృద్ధిని ప్రజలు గమనించాల ని కోరారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో జిల్లాకు మెడికల్ కాలేజి, నర్సింగ్ కళాశాల మంజూరు చేశారని, ఓర్వలేని ప్రతిపక్షాల నాయకులు వీటిపై కూడా కేసులు పెట్టి, అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

అభివృద్ధి కోరుకుంటున్న తరణంలో ఇతర పార్టీలకు కనీసం డిపాజిట్‌లు కూడా దక్కవని, బీఆర్‌ఎస్ పార్టీ గెలుపును ఆపే దమ్ము ఎవరికీ లేదని బండ్ల జ్యోతి అన్నారు. 2018లో జరిగిన ఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై బీఆర్‌ఎస్ అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి 28వేల ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారని, వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలుస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజలు అందించిన భారీ విజయానికి గద్వాల ఎమ్మెల్యే కుటుంబం ఎంతో రుణపడి ఉంటుందన్నారు.

ఎమ్మెల్యే తనయుడు బండ్ల సాయి సాకేత్ రెడ్డి మాట్లాడుతూ…గద్వాల నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి ప్రజల ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ, మరోసారి బీఆర్‌ఎస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. అసమర్థులకు అధికారం ఇస్తే, ఈ ప్రాంతం అభివృద్ది నోచుకోక వెనుకబడి పోతుందని ప్రజలకు సూచించారు. అనంతరం వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్‌ఎస్ పార్టీలోచేరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రైతుసమన్వయ సమితి అధ్యక్షులు చెన్నయ్య, గద్వాల పీఏసీయస్ చైర్మన్ సుభాన్, ఎంపీపీ ప్రతాప్‌గౌడ్, జడ్పీటీసీ ప్రభాకర్ రెడ్డి, పీఏసీయస్ చైర్మన్ తిమ్మారెడ్డి, నాయకులు నాగర్‌దొడ్డి వెంకట్రాములు, రమేష్‌నాయుడు, జయరాంరెడ్డి, సత్యారెడ్డి, గోపిరెడ్డి, భాస్కర్ రెడ్డి, బీచుపల్లి, జగదీశ్వర్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, రాముడు, పూడూరు చిన్నయ్య, నరసింహులు, శ్రీరాములు, నరేష్ కుమార్‌రెడ్డి, యూత్‌ఫోర్స్ సభ్యులు చక్రధర్‌రెడ్డి, సాయిశ్యామ్‌రెడ్డి, చిట్టెం పురుషోత్తంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News