Tuesday, December 24, 2024

విధి నిర్వహణలో సిబ్బందికి సంస్థ అండగా ఉంటుంది:  శ్రీ రంగరావు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్: విద్యుత్ సిబ్బంది విధి నిర్వహణలో నిబద్దతో పని చేయాలని తద్వార ఇటు వినియోగదారులకు,అటు సంస్థకు మరింత మెరుగై సేవలు చేయవచ్చని టిఎస్‌ఈర్‌సి ఛైర్మన్ తన్నీరు శ్రీ రంగారావు అన్నారు. సోమవారం విధి నిర్వహణలో సమర్థంతంగా సేవలు అందించిన సిబ్బందిని ఆయన ఘనంగా సత్కరించారు. ఏ సంస్థ అయినా ఆర్దికంగా బలోపేతం కావాలంటే వనరులు ముఖ్యమని, సంస్థకు విద్యుత్ బిల్లులు ప్రధాన ఆర్దిక వనరని వాటిని వినియోగదారులు నుంచి సకాలంలో వసూలు చేయాలన్నారు. కొంత మంది వినియోగదారులు సిబ్బంది బిల్లుల వసూళ్ళకు వెళ్ళినప్పుడు వారిపై బహరింగ దాడులు చేయడం, బెదిరింపులకు పాల్పడటం వంటి సంఘటలకు పాల్పడుతున్నారని, అటువంటి సందర్భాల్లో సంస్థ వారికి ( విద్యుత్ సిబ్బంది) అండగా ఉంటుందన్నారు.

సిబ్బంది భద్రతకు సంస్థ అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని, ఇటు సిబ్బంది కాని, అటు వినియోగదారులు కాని చట్టాన్ని చేతుల్లో కి తీసుకునే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. సిబ్బంది విధి నిర్వహణలో వినియోగదారులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా ఆయన ఎండి మనోహర్ రాజు,టెక్నికల్, ఫైనాన్స్ మెంబర్ బండారు కృష్ణయ్యను ఆయన సత్కరించారు. విద్యుత్ బిల్లుల్లో వసూళ్ళళ్ళపై ప్రత్యేక దృష్టి సారించిన మొఘల్‌పుర ఆపరేషన్ ఏఈ జి.లక్ష్మీనారాయణ,మహ్మద్ అబ్దుల్ సలీమ్‌లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో టిఎస్‌ఈఆర్సీ కార్యదర్శి నాగరాజు, టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ డైరక్టర్‌ం స్వామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News