10900 క్యూసెక్కుల నీరు మంజీరా లోకి..
ప్రధాన కాలువ గేట్ల ఎత్తివేత..
కామారెడ్డి : నాగిరెడ్డిపేట మండలం సమీపంలో ఉన్న పోచారం ప్రాజెక్టు గురువారం 11 గంటల నుండి ఆయకట్ట పైనుండి భారీ ఎత్తున పొంగిపొర్లుతోంది. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 1.820 టీఎంసీలు కాగా పూర్తిస్థాయిలో ప్రాజెక్టు లోకి గురువారం రాత్రి నీరు వచ్చి చేరింది. మునుపెన్నడూ లేని విధంగా నాలుగైదు రోజుల్లో కురిసిన వర్షాలకు ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలోని గాంధారి మంచిప్ప అడవుల్లో కురిసిన వర్షాలకు లింగంపేట్ పెద్దవాగు, గుండారం వాగులు భారీ నీటి ప్రవాహంతో ప్రాజెక్టు నిండింది. వాగుల నుండి ప్రాజెక్టులోకి10900 క్యూసెక్కుల నీటి సామర్థ్యంతో వాగులు ద్వారానే మీరు ప్రాజెక్టులోకి వస్తుంది. ప్రాజెక్టు నుండి వాగుల నుండి వస్తున్న నీరు ప్రాజెక్టు ఆయకట్టు పై నుండి పొంగిపొర్లే మంజీరా నదిలోకి వెళ్తుంది.
నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాలకు వరప్రదాయిని అయినా ఈ ప్రాజెక్టు గత మూడు సంవత్సరాల నుండి జూలై మాసంలో ప్రాజెక్టు పూర్తి స్థాయి నుండి పొంగి పడుతుంది, గత సంవత్సరం జూలై మాసం శివ రణ ప్రాజెక్టు నిండి పొంగి పొర్లి సుమారు మూడు టీఎంసీల నీరు మంజీరా నది ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్టు లోకి వెళ్ళింది, పొర్లిన నీరు మంజీరా నదిలో కమ్ముకొని లోతట్టు ప్రాంత వ్యవసాయ భూములు, కొన్ని గ్రామాలలో కి నీరు వచ్చి కమ్ముకుంది, ప్రాజెక్టు 58 కిలోమీటర్ల ప్రధాన కాలువ, 73 డిస్ట్రిబ్యూటర్ లతో( తూములు-) సుమారు 20 వేల ఎకరాల పంట సాగు భూములకు మీరు అందిస్తుంది.
ప్రధాన కాలువ గేట్లు ఎత్తివేత..
ప్రాజెక్టు కుడివైపున ఉన్న ప్రధాన కాలువ గేట్లను ఎత్తివేసి పంట సాగుకు నీటిని శుక్రవారం మధ్యాహ్నం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే, నీటిపారుదల శాఖ అధికారులు విడుదల చేశారు. ఈ విడుదల కార్యక్రమంలో ఎమ్మెల్యే జాజుల సురేందర్ పలువురు పాల్గొన్నారు.