నేచురల్ స్టార్ నాని తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి చేసిన రా అండ్ రస్టిక్ బ్లాక్ బ్లాక్‌బస్టర్ ‘దసరా’ ప్రేక్షకులని అభిమానులని సర్ ప్రైజ్ చేసింది. నాని మరోసారి దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, ఎస్‌ఎల్‌వి సినిమాస్ నిర్మాత సుధాకర్ చెరుకూరితో కలిసి మరో బిగ్ ప్రాజెక్ట్ కోసం చేతులు కలిపారు. వారి న్యూ మూవీ ‘ది ప్యారడైజ్’లో నాని మరో బోల్డ్, లార్జర్- దెన్- లైఫ్ పాత్రలో అలరించబోతున్నారు. సోమవారం మేకర్స్ ‘రా స్టేట్‌మెంట్’ అనే గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఇది ఫస్ట్ ఫ్రేమ్ నుండే ‘రా‘ అనే పదాన్ని ఎందుకు ఉపయోగించారో అర్థం వచ్చేలా చూపించింది. నాని అద్భుతమైన మేకోవర్ అదిరిపోయింది.
ఈ చిత్రం తిరుగుబాటు, నాయకత్వం యొక్క వరల్డ్‌లోకి ఒక ఎపిక్ జర్నీగా ఉంటుందని హామీ ఇస్తుంది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మరోసారి తాను విజనరీ ఫిల్మ్ మేకర్ అని నిరూపించుకున్నాడు. తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్, స్పానిష్ ఐదు భాషలలో విడుదలైన ది రా స్టేట్‌మెంట్ ఊహించని వాటిని అందిస్తూ కొత్త ప్రమాణాన్ని నిర్దేశిస్తుంది. కన్నడ, మలయాళం, బెంగాలీ వర్షన్‌లో గ్లింప్స్ త్వరలో విడుదల కానున్నాయి. రా స్టేట్‌మెంట్ ద్వారా ప్రకటించినట్లుగా ‘ది ప్యారడైజ్’ మార్చి 26, 2026న థియేటర్స్‌లో విడుదల కానుంది.