Wednesday, January 22, 2025

బాధిత కుటుంబాలకు పార్టీ ఇన్సూరెన్స్ అందజేత

- Advertisement -
- Advertisement -

హుస్నాబాద్: బిఆర్‌ఎస్ కార్యకర్తలకు ఎల్లప్పుడు అండగా ఉంటుందని ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాయలంలో వివిధ సందర్భాల్లో ప్రమాదవశాత్తు మరణించిన బిఆర్‌ఎస్ కార్యకర్తలు, పార్టీ సభ్యుల కుటుంబాలకు ఇన్సూరెన్స్ చెక్కులను పంపిణీ చేశారు. కోహెడ మండలం గుండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన బిఆర్‌ఎస్ కార్యకర్త లక్ష్మణ్ మృతి చెందగా వారి సతీమణి లావణ్యకు రెండు లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బిఆర్‌ఎస్ సభ్యత్వం తీసుకున్న వారికి బిఆర్‌ఎస్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తుందన్నారు. ఎవరైనా కార్యకర్తలు అనుకోని రితీలో ప్రమాదానికి గురై మృతిచెందితే వారి కుటుంబాలకు రూ. 2 లక్షల ఇన్సూరెన్స్ కింద ఇచ్చి ఆదుకుంటుందన్నారు. రెండు లక్షల ఇన్సూరెన్స్ కింద బాధిత కుటుంబాలకు మంజూరయ్యే విధంగా కృషి చేసిన ఎమ్మెల్యే సతీష్ కుమార్‌కు బిఆర్‌ఎస్ ,నాయకులు, ప్రజాప్రతినిధులు , బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News