Monday, December 23, 2024

అమిత్‌కు టికెట్ విషయంలో పార్టీదే తుది నిర్ణయం

- Advertisement -
- Advertisement -

నల్గొండ:జిల్లా మంత్రి జగదీష్ రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని,తనయుడు అమిత్‌కు టికెట్ విషయం లో పార్టీ దే తుది నిర్ణయం అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు. నల్గొండలో తన నివాసంలో ఆయన విలేకరులతో చిట్ చా ట్ లో మాట్లాడుతూ జగదీష్ రెడ్డికి, నాకు విభేదాలు ఉన్నట్లుగా జరుగుతున్న ప్రచారం వట్టిమాటేనన్నారు.జిల్లా అధికారిక వ్యవహారాల్లో నేను ఎన్నడూ జోక్యం చేసుకొనని, ఉద్యోగాల బదిలీలలో, నామినేటెడ్ పోస్టుల భర్తీలో నేను ఎప్పుడూ జోక్యం చేసుకోలేదన్నారు.అధికారికంగా, రాజకీయంగా ఏం జరిగినా సీఎం కేసీఆర్ దృష్టిలో ఉంటుందన్నారు.

ఎవరైనా నా వద్దకు వచ్చినా నిబంధనలు ప్రకారం వెళ్లాలని చెబుతానన్నారు. తన కొడుకు అమిత్ కు టికెట్ విషయంలో పార్టీ దే తుది నిర్ణయం పార్టీ అవకాశం ఇస్తేనే నా కొడుకు అమిత్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారన్నారు. టికెట్ కోసం పైరవీలు, ప్రాకులాడాడం చేయనన్నారు.సొంత పా ర్టీ ఎంపీపీ, మున్సిపల్ చైర్మన్‌లపై అవిశ్వాస తీర్మానాలు పెట్టడం సరికాదని, ఇటువంటి పరిణామాలను తాను తీవ్రంగా వ్యతిరేకిస్తానన్నారు. కొ ంతమంది విజ్ఞత లేకుండా మాట్లాడుతున్నారని, నోటికి అడ్డూ అదుపు లేకుండా వెంకట్ రెడ్డి మాట్లాడుతున్నారన్నారు. నేను బాష ప్రయోగం వి షయంలో హుందాగా ఉంటానన్నారు.

బురదలో రాయివేసే అలవాటు నాకు లేదన్నారు.రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమన్నారు. కమ్యూనిస్టులతో పొత్తుల అంశం తేలితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో సీట్ల మార్పు ఉండొచ్చేమోనన్నారు. వామపక్షాలు బీఆర్‌ఎస్‌తో పొత్తుకు సుముఖంగా ఉన్నాయి. ఎక్కడా పని చేసినా రాజకీయ నాయకులకు, ప్రజా ప్రతినిధులకు ఆత్మవిమర్శ అనేది ఉండాలన్నారు. నేను చేసేదే కరెక్ట్.. నా కు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదని అనుకుంటే బొక్క బోర్లా పడటం ఖాయమన్నారు. కాగా తమ పనిని ప్రజలు మెచ్చుతున్నారా.. ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అనేది ప్రజాప్రతినిధులు ఆలోచించుకోవాలన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఅరెస్ అన్ని సీట్లలో విజయం సాధిస్తుందన్నారు. కృష్ణా జలాల పంపిణీ విషయం లో కేంద్ర ప్రభుత్వ తాత్సారం చేస్తుందని విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News