Monday, December 23, 2024

ఉపాధి హామి ఉద్యోగులకు పే స్కేల్ వర్తింప చేయాలి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : ఉపాధి హామి ఉద్యోగులకు పే స్కేల్ వర్తింప చేయాలని ఉపాధి హామి పథకంలో పని చేస్తున్న ఉపాధి హామి ఉద్యోగుల జెఎసి ప్రతినిధులు మంత్రి హరీశ్‌రావుకు విజ్ఞప్తి చేశారు. గౌరవాధ్యక్షులు, నర్సంపేట ఎంఎల్‌ఎ పెద్ది సుదర్శన్ రెడ్డితో పాటు ఉద్యోగుల జెఎసి ప్రతినిధులు శుక్రవారం మంత్రి హరీశ్‌రావుని హైదరాబాద్‌లోని ఆయన ఇంటి వద్ద కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. ఉపాధి హామి పథకం మొదలైనప్పటి నుండి పనిచేస్తున్న ఉద్యోగులు చాలీ చాలని వేతనాలతో కాలం వెళ్ళదీస్తున్నారని మంత్రికి వివరించారు. దేశంలోనే మన రాష్ట్రం ఉపాధి హామిలో నెంబర్ వన్‌గా నిలవడంలో ఉపాధి హామి ఉద్యోగుల పనితనం, ప్రతిభ కూడా దాగి ఉందన్నారు. వారి పనికి తగిన విధంగా వేతనాలు అందాలంటే వారికి పే స్కేల్ వర్తింపచేసి అమలు చేయాలని కోరారు. ఇందుకు తగిన విధంగా ఆలోచించి ముఖ్యమంత్రిని ఒప్పించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఇందుకు మంత్రి హరీశ్‌రావు స్పందిస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామినిచ్చారు.

మంత్రి హరీశ్‌రావును కలిసిన వారిలో ఎంజినరేగా రాష్ట్ర జెఎసి చైర్మన్ ఎ. లింగయ్య, కో చైర్మన్లు అంజిరెడ్డి, విజయ్ వెంకటరామిరెడ్డి, మోహన్ రావు, రఘు, జిల్లా జెఎసి చైర్మన్లు ఉన్నారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3,874 మంది ఉపాధి హామి ఉద్యోగులు పే స్కేల్ కోసం జెఎసిగా ఏర్పడ్డాయి. సెర్ప్ ఉద్యోగల మాదిరిగా తమకు కూడా పే స్కేల్ పే స్కేల్ ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటికే శాసన మండలి చైర్మన్, శాసన సభ స్పీకర్, 62 మంది ఎంఎల్‌సిలు, ఎంఎల్‌ఎలు, నలుగురు ఎంపీలు, ఇద్దరు మహిళా కమిషన్ చైర్మన్లు నుంచి మద్దతు లేఖలను సేకరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News