Wednesday, January 22, 2025

రాముడి చరిత్ర దేశ ప్రజలకు తెలుసు… ఇప్పుడు ప్రధాని మోడీ చెప్పాల్సిన అవసరం లేదు

- Advertisement -
- Advertisement -

రాజకీయ లబ్దికోసం బిజెపి కొత్త నాటకం
రామమందిర కార్యక్రమానికి రాష్ట్రపతికి ఆహ్వానం లేకపోవడంపై మల్లు రవి ఆగ్రహం

మన తెలంగాణ/హైదరాబాద్: అయోధ్యలో జరిగిన బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఎందుకు ఆహ్వానించలేదని, ఎస్టీ మహిళ కావడంతో మోడీ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు రవి ఆరోపించారు. సోమవారం సచివాలయంలో మీడియా సెంటర్‌లో మాట్లాడుతూ రాముడి చరిత్ర దేశ ప్రజలందరికీ తెలుసు.. ఇప్పడు బిజెపి చెప్పాల్సిన అవసరం లేదని, దేశ ప్రజలంతా రాముని ఆదర్శంగా తీసుకుని జీవితం కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు.

రాజకీయ లబ్ధి కోసం దేవుడి పేరుతో కొత్తనాటకానికి తెర లేపారని మండిపడ్డారు. అయోధ్య గుడి నిర్మాణానికి కాంగ్రెస్ వ్యతిరేకమనే ప్రచారం అసత్యమని దేశ ప్రజల మనోభావాలను తమ పార్టీ గుర్తిస్తుందన్నారు. అస్సాంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ యాత్రకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అడ్డంకులు సృష్టించి, నిజమైన హిందువును అనిపించుకునేందుకు ఆరాట పడుతున్నారని ఎద్దేవా చేశారు. ఈసందర్భంగా ఆయన ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా అవకాశం కల్పించిన సిఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. దావోస్ పర్యటనకు వెళ్లిన సిఎం రేవంత్ బృందం తెలంగాణకు రూ. 40 వేల కోట్ల పెట్టుబడులు తెచ్చారని కొనియాడారు. అదే విధంగా త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ స్థానం పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రత్యేక ప్రతినిధిగా ఉన్నా పోటీ చేసేందుకు అర్హత ఉందని, రాష్ట్ర జలవనరులు, ప్రాజెక్టుల సమస్యల కోసం కేంద్రం ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు చర్చించడానికి నియమించినట్లు చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News