Thursday, January 23, 2025

తెలంగాణ పోలీసుల పనితీరు దేశానికే ఆదర్శం

- Advertisement -
- Advertisement -

గజ్వేల్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సిఎం కెసిఆర్ దార్శనికత, మార్గదర్శనంతో పోలీసు వ్వవస్థలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని సిద్దిపేట జిల్లా పోలీసు కమీషనర్ శ్వేత అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ ంలో సురక్షా తెలంగాణ దశాబ్ది దినోత్సవాలలో భా గంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో జరిగిన సురక్షా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో 3కె రన్ నిర్వహించారు. ఈ పరుగులో పెద్ద సంఖ్యలో యువత, విద్యార్థులు, పోలీసులు పాల్గొన్నారు. పోలీసు స్టేషన్ ఆవరణలో వివిధ రకాలైన ఆయుధాల ప్రదర్శనతో ఓపెన్ హౌజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా జరిగిన సమావేశ0లో పోలీసు కమీషనర్ శ్వేత మాట్లాడుతూ ఇటీవలి కాలంలో వచ్చిన విప్లవాత్మక మార్పుల్లో భాగంగా పోలీసుల పనితీరులో కూడా గుణాత్మక మార్పు వ చ్చిందన్నారు. నేర పరిశోధనలో కూడా అనేక ఆధునిక సాంకేతికతను జోడించి కొనసాగుతున్న దర్యాప్తు కారణంగా నేరస్తులను పట్టుకోవటం సులువైందన్నా రు. నేరస్తులు ఎట్టి పరిస్థితిలోను తప్పించుకు పోయే పరిస్థితి ఇప్పుడు లేదన్నారు. ఏదైనా నేరం జరిగిన సందర్భాలలో ఆధునిక శిక్షణ కలిగిన పోలీసు జాగిలాలు, కొత్త సాంకేతికతను జోడించి సరైన ఆధారాల సేకరణలో పనిచేస్తున్న క్లూస్ బృందాల పనితీరు ఎం తో మెరుగు పడిందన్నారు.

అంతే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో పలు పోలీసు స్టేషన్ల పరిధిలో విస్తారంగా ఏర్పాటు చేసిన సిసి కెమెరాల వల్ల కూడా నేరస్తులను గుర్తించటం సులభంగా మారిందన్నారు. నేరస్తులను గుర్తించటం ఒక ఎత్తయితే వారిని సరైన సాక్షాధారాలతో కోర్టులో హాజరు పరిచి శిక్షలు పడే విధంగా అవసరమైన నైపుణ్యాలు, టెక్నికల్ ఎవిడెన్స్ ను కలిగి ఉండటం కూడా తమకు కలసివస్తున్న అం శమన్నారు. తెలంగాణ పోలీసు శాఖ పనితీరు దేశంలోనే ఆదర్శంగా ఉందని , తమపై సిఎం కెసిఆర్ పెట్టుకున్న విశ్వాసాన్ని వమ్ముచేయకుండా ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చే విధంగా తాము పనిచేస్తామని సిపి శ్వేత తెలిపారు. పోలీసుల మెరుగైన పనితీరులో కేసుల దర్యాప్తులో మంచి ఫలితాలు సాధిస్తున్నామన్నారు.

నేరస్తులను పట్టుకోవటంలోను, శాంతి భద్రతలను పరిరక్షించటంలోను ప్రజల సహకారం తమకు ఎంతో ఉందని , ఈ సహకారాన్ని ఇకముందుకూడా పోలీసులకు అందించాలని ఈ సందర్భంగా సిపి శ్వేత ప్రజలను కోరారు. ఈ కార్యక్రమ ంలో ఎమ్మెల్సీ డా. యాదవ రెడ్డి , ఎఫ్‌డిసి ఛైర్మన్ ప్ర తాపరెడ్డి,మున్సిపల్ ఛైర్మన్ ఎన్సీ రాజమౌళి గుప్తా, జడ్పిటిసి పంగ మల్లేశం, మున్సిపల్ వైస్ ఛైర్మన్ జకీయొద్దీన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వివిధ ఆధునిక ఆయుధాలు, నేరపరిశోధనలో సాంకేతిక పరికరాలతో ఒక ప్రదర్శన ఏర్పాటు చేశారు.

ఈ ప్రదర్శనలోని ముఖ్య అంశాలను గజ్వేల్ ఎసిపి మడత రమేష్ ప్రజాప్రతినిధులకు, ప్రజలకు వివరించారు. ఈ ఓపెన్ హౌజ్‌ను తిలకించిన వారిలో గడా ప్రత్యేక అధికారి ముత్యం రెడ్డితో పాటు ఎమ్మెల్సీ డా. యా దవ రెడ్డి , ఎఫ్‌డిసి ఛైర్మన్ ప్రతాపరెడ్డి,మున్సిపల్ ఛై ర్మన్ ఎన్సీ రాజమౌళి గుప్తా,ఏఎంసి చైర్మన్ మాదాసి శ్రీనివాస్, ఆత్మ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, జడ్పీటిసి పంగ మల్లేశం, మున్సిపల్ వైస్ ఛైర్మన్ జకీయొద్దీన్ , పలువురు విద్యార్థులు, యువత తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News