Monday, January 20, 2025

జిల్లా పోలీస్ యంత్రాంగం పనితీరు బేష్

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట: జిల్లా పోలీసులు పని విభాగాల నిర్వహణలో, ప్రతిభలో జిల్లా పోలీస్ యంత్రాంగం పనితీరు ఎంతో మెరుగుగా ఉందని జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ అన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన 2023 అర్ధవార్షిక పోలీస్ అధికారుల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు ఆధునిక పోలీసింగ్ నిర్వహణలో ప్రజలను భాగస్వాములను చేయాలన్నారు.

జిల్లాలో పోలీస్ పని విభాగాల నిర్వహణలో, జిల్లా ప్రతిభ, పలు పని విభాగాల్లో జిల్లా ప్రథమ స్థానంలో ఉందన్నారు. గడిచిన 2021/22 సంవత్సరాలతో పోలిస్తే జిల్లాలో హత్యలు, మోసాలు, ఆర్థికపరమైన నేరాలు, మహిళా సంబంధిత నేరాలు, అక్రమ రవాణా, బాలలపై వేధింపులు, కులదూషణ కేసులు, రోడ్డు ప్రమాదాలు భారీగా తగ్గినట్లు తెలిపారు.కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల్లో 3500 కేసులు పరిష్కారమైనట్లు తెలిపారు.జిల్లాలో నేరాలశాతం భారీగా తగ్గినట్లు పేర్కొన్నారు.

ఎన్నికల నిర్వహణకు పోలీసులు సన్నద్ధం కావాలి..
రాబోయే శాసన సభ ఎన్నికల నిర్వహణకు పోలీస్ అధికారులు, సిబ్బంది సన్నద్దం కావాలని జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఎన్నికల నియమావళిని పకడ్బందిగా అమలు చేసేందుకు కృషి చేయాలన్నారు. గతంలో ఎన్నికల సమయంలో నేరాలకు పాల్పడిన వారిని, చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వ్యక్తులను బైండోవర్ చేయాలన్నారు. డబ్బు, మద్యం, గంజాయి, అక్రమ మద్యం రవాణపై పోలీస్ అధికారులు దృష్టి సారించాలన్నారు.

పోలీస్ అధికారులు వారి పోలీస్ స్టేషన్‌ల పరిధిలో ఆకస్మిక వాహనాల తనిఖీలు చేయాలని, చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వ్యక్తుల సమాచారాన్ని సేకరించాలని సూచించారు. ఈ సమావేశంలో డీఎస్పీలు నాగభూషణం, వెంకటేశ్వరరెడ్డి, రవి, శ్రీనివాస్, సీఐలుఉ అశోక్, రాజశేఖర్, శివశంకర్, రామలింగారెడ్డి, మురారి, రాము, రామకృష్ణారెడ్డి, రాఘవులు, రాజేష్, నాగార్జున, ఆర్‌ఐలు శ్రీనివాస్, శ్రీనివాసరావు, ఎస్సైలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News