Saturday, December 21, 2024

వాగులో పడి వ్యక్తి గల్లంతు

- Advertisement -
- Advertisement -

మేడ్చల్: మండల పరిధిలోని రావల్ కోల్ గ్రామ శివారులోని వాగులో వ్యక్తి పడి గల్లంతైన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అస్సాం రాష్ట్రానికి చెందిన రశీదు హుస్సేన్ (48) ఏడాది క్రితం రావల్‌కోల్ గ్రామానికి బతుకు దెరువు కోసం వచ్చి స్థానికంగా ఉన్న ఓ పరిశ్రమలో పని చేస్తున్నాడు. బుధవారం పరిశ్రమకు విధులకు వెళ్లకుండా గ్రామ శివారులోని వాగు వద్దకు వెళ్లాడు. అందులో స్నానం చేయడానికి దిగి గల్లంతు కావడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News