Monday, December 23, 2024

‘జాగృతి’ వారపత్రికలో రేవంత్ రెడ్డి జర్నలిస్ట్‌గా వర్క్ చేసిన ఫోటో నెట్టింట వైరల్ !

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్:  పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి సంబంధించిన ఓ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. ఆయన రాజకీయాల్లోకి వచ్చి దాదాపు ఇరవై ఏళ్లు కూడా కాలేదు. 2017లో కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ తర్వాత నాలుగేళ్లకు ఆ పార్టీ అధ్యక్షుడు అయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో ఆయనదే ఎక్కువ పాత్ర ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఆయనకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. ఫోటోలో నల్లటి షర్ట్ వేసుకున్న వ్యక్తి రేవంత్ రెడ్డి. ముప్పై ఏళ్ల క్రితం ఆయన ‘జాగృతి’ అనే వారపత్రికలో పని చేశారంటూ ఫోటో వెలుగుచూసింది.

ఆ ఫోటోలో అదే జాగృతిలో పని చేసిన మరో ముగ్గురు స్నేహితులు ఉన్నారు. ఈ ఫోటోను రేవంత్ అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు షేర్ చేస్తున్నారు. ఎబివిపి నేతగా ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ పత్రిక జాగృతిలో పని చేశారంటూ బిజెపి కార్యకర్తలు కూడా గుర్తు చేసుకుంటూ ఫోటోను షేర్ చేస్తున్నారు. జర్నలిస్ట్‌గా ప్రారంభమైన ఆయన కెరీర్ రాజకీయ నాయకుడిగా ఎదిగి ఇప్పుడు ముఖ్యమంత్రి కాబోతున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు పేర్కొంటున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News