Thursday, January 23, 2025

దుబ్బాకలో ఎగిరేది గులాబీ జెండానే…

- Advertisement -
- Advertisement -
  • దళిత, బిసి సంక్షేమంలో తెలంగాణ ఆదర్శం
  • ఎంపి సమక్షంలో బిఆర్‌ఎస్‌లో చేరిన 200 మంది ఎమ్మార్పిఎస్ నాయకులు

దౌల్తాబాద్: ఎవరెన్ని కుట్రలు చేసినా తిరిగి మూడోసారి తెలంగాణలో సిఎం కెసిఆర్ ఆధ్వర్యంలో బిఆర్‌ఎస్ ఏర్పాటు చేయడం ఖాయమని ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. దౌల్తాబాద్‌లోని ఎస్వీ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర ఎమ్మార్పీఎస్ నాయకులు డప్పు శివరాజు ఆధ్వర్యంలో నియోజకవర్గంకు చెందిన 200 మంది ఎమ్మార్పిఎస్ కార్యకర్తలు ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి సమక్షంలో బిఆర్‌ఎస్‌లో చేరారు. ఈసందర్భంగా ఎంపి మాట్లాడుతూ దళితుల సంక్షేమం గురించి ఎన్నికల్లో మాట్లాడే నాయకులు తర్వాత మరిచిపోవడం మనం 70 ఏళ్లుగా చూస్తున్నామని, అమలు చేస్తున్న ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కుతుందన్నారు. తెలంగాణ ప్రజల గురుంచి, వారి స్థితిగతుల గురుంచి పూర్తి స్థాయిలో తెలిసిన వ్యక్తి సిఎం కెసిఆర్ మాత్రమేనన్నారు.

70 ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో దళితుల అభివృద్ధి గురుంచి మాట్లాడిన వారే తప్ప సిఎం కెసిఆర్‌లా అమలు చేసిన వారు ఎక్కడా లేరన్నారు. దళిత బంధు మీద ఎన్నో అనుమానాలు, దుష్ప్రచారం చేశారని, దశల వారీగా దిగ్విజయంగా అమలు చేసి దేశానికి స్ఫూర్తిగా నిలిపారన్నారు. ఢిల్లీలో ఎన్నోసార్లు సిఎం కెసిఆర్ మేధావులతో దళితుల సంక్షేమంపై చర్చ చేసాడని, నేడు దళిత బంధు పథకం దేశంలోనే స్ఫూర్తిగా నిలిచిందన్నారు. తెలంగాణ తరహా అభివృద్ధి, సంక్షేమాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేసే ప్రయత్నంలో భాగంగానే బిఆర్‌ఎస్ ద్వారా జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం జరిగిందన్నారు. ఉద్యమ నాయకులు డప్పు శివరాజు మన పార్టీలోకి రావడం శుభదాయకం 200 మంది మా పార్టీలోకి రావడం పట్ల ఘన స్వాగతం పలుకుతున్నాం.

నేను తెలంగాణ ఉద్యమం నుండి వొచ్చిన వాడినే..పదవులు వొస్తుంటాయి. రైల్వే అండర్ బ్రిడ్జి, జాతీయ రహదారులు, రాష్ట్ర హక్కుల కోసం పార్లమెంటులో పోరాటం చేశాము జలవిహార్‌లో తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు కూడా నేను ఉస్మానియా నుండి విద్యార్థుల ను తీసుకొని వెళ్లి పాల్గొన్నాను ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత సిఎం కెసిఆ ర్ ఆధ్వర్యంలో బిఆర్‌ఎస్‌లో చేరి ప్రజా సేవలో పాల్గొంటున్నానని ఆయన తె లిపారు. మన పార్టీలో ఉన్న సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి. పూలు వేసే వారికన్నా రాళ్లు వేసే వారు అధికంగా ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. ని ధులు మనం తెస్తే కొంత మంది తామే చెప్పామని డబ్బా కొట్టుకుంటున్నారు.

దుబ్బాక ఉద్యమాల గడ్డ

జిమ్మిక్కులు అవసరం లేదు మనం నిజాయితీగా ముందుకు పోదాం ఇప్పటికే దుబ్బాక ప్రజలు మోస పోయాం గోస పడ్డాం ఆని బాధపడుతున్నారు ఎవరికి వారే కృషి చేయాలి దళితుల కోసం పనిచేసే నాయకుడు ఎవరు లేరు. రాష్ట్రం వేరే వల్ల చేతిలో పెడితే పిచొని చేతిలో రాయి పెట్టినట్లు అవుతుంది గతంలో మాయ మాటలు చేప్పి మోసం చేశారు మరోసారి మోసం చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు ఎన్నికలు రాకముందే ప్రతిపక్ష పార్టీలలో కొందరు సిఎం పదవి కోసం కొత్త బట్టలు కుట్టించుకుంటున్నారు ఆపదలో, సంపదలో మనం పనిచేస్తున్నాం కరువు మండలాలలో మొదటి మండలం దౌల్తాబాద్ ఉండేది నేడు మల్లన్నసాగర్ కొండపోచమ్మ ద్వారా సస్యశ్యామలమవుతుంది పెండింగ్ లో ఉన్న కాలువల నిర్మాణం పూర్తి చేసుకుందాం ప్రతి ఎకరాకు సాగునీళ్లు అందించుకుందామన్నారు.

నాడు కరువులో ఉన్న దౌల్తాబాద్

నేడు లారీల కొద్దీ ధాన్యం రాశులతో కళకళలాడుతోంది

తాగునీటి కోసం నాడు గ్రామాల్లో లొల్లి పెట్టికునేవారు నేడు ఇంటింటికి నల్లా నీళ్లు గ్రామాల అభివృద్ధి వేగవంతమైంది చెత్త ట్రాక్టర్, స్మశానవాటిక, డంపింగ్ షేడ్, పార్కు, నర్సరీ, క్రీడా మైదానాలు ఏర్పాటు చేసుకున్నాం మా కోసం పనిచేస్త్తున్న మీ కోసం కోన ఊపిరి వరకు పనిచేస్తామని హామీ ఇస్తున్నాను 6 నెలలు కష్టపడితే మన దుబ్బాక దశ మారిపోతుంది సీఎం కేసీఆర్ మన ప్రాంత వ్యక్తి కాబట్టి దుబ్బాక అభివృద్ధి కోసం పూర్తి స్థాయిలో సహకారం అందించడం జరుగుతుందన్నారు కార్యక్రమంలో మండల బిఆర్‌ఎస్ అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్, ఎమ్మార్పిఎస్ నాయకులు గుర్రాల శ్రీనివాస్, కరికే శ్రీనివాస్, ర్యాకం శ్రీరాములు, ఎంపిపి గజ్జెల సాయిలు, సొసైటీ చైర్మన్ వెంకట్ రెడ్డి, రైతు బంధు అధ్యక్షుడు స్టీవెన్ రెడ్డి, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు రహీం, మండల కోఆప్షన్ సభ్యుడు హైమద్, సర్పంచ్ కొమ్మేర పూజిత వెంకట్ రెడ్డి, ధార సత్యనారాయణ, యాదగిరి, జనార్దన్, ఎంపిటిసిలు లక్ష్మీ మోహన్ రావు, దేవేందర్, వీరమ్మ మల్లేశం, గ్రామ పార్టీ అధ్యక్షుడు ఉమ్మడి నర్సింహారెడ్డి, బిఆర్‌ఎస్ నాయకులు అందె లింగం,ఇప్ప దయాకర్, రమేష్,పాల రవీందర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News