Monday, December 23, 2024

సమాజంలో చెడును పారదోలేందుకు పోలీసు విభాగం కృషి

- Advertisement -
- Advertisement -
  • జిల్లా ఎస్పీ రక్షిత కె.మూర్తి

వనపర్తి: సమాజంలో చెడును పారదోలేందుకు పోలీసు విభాగం కృషి చేస్తుందని జిల్లా ఎస్పీ రక్షిత కె.మూర్తి అన్నారు. ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని సాయుధ దళ పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ రక్షిత కె.మూర్తి ఆయుధాలకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నిరంతరం ప్రజా సేవలో జీవించే జిల్లా పోలీసులకు దసరా పండుగ సందర్భంగా దుర్గాదేవి అనుగ్రహంతో విజయం వరించాలని ఆకాంక్షించారు.

నవరాత్రి వేడుకల్లో భాగంగా పోలీసు ఆయుధాలకు, వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. విధి నిర్వహణలో పోలీసులు ఆయుధాలకు, వాహనాలకు ఎలాంటి ఆటంకం లేకుండా ఉండాలని బ్రాహ్మణులు మంత్రోచ్ఛారణాలతో పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా పోలీసు యంత్రాంగం దుర్గాదేవి ఆశీస్సులతో ప్రజలకు అందుబాటులో ఉండి ఉత్తమసేవలు అందించి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలని అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడు పోలీసు వారిపై ఉండాలని ఎస్పీ కోరారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమి పండుగను జరుపుకుంటారని అన్నారు. సమాజంలో చెడును పారదోలేందుకు పోలీసు విభాగం కృషి చేస్తుందని తెలిపారు.

అదేవిధంగా ఎస్పీ జిల్లా పోలీసు సిబ్బందికి , జిల్లా ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాయుధ దళాధిపతులు శ్రీనివాస్, అప్పలనాయుడు, స్పెషల్ బ్రాంచ్ ఇన్సెక్టర్ మధుసూదన్, కొత్తకోట సిఐ శ్రీ శ్రీనివాసరెడ్డి, ఆర్‌ఎస్‌ఐలు సాయుధ దళ సిబ్బంది జిల్లా పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News