భర్తను హత్య చేసింది భార్య నాగమణి
రోజు తాగి చిత్రహింసలు పెడుతున్నాడని ఘాతుకానికి ఒడిగట్టిన భార్య
శంషాబాద్: ఫాంహౌస్‌లో సూపర్ వేజర్‌గా పనిచేస్తున్న వ్యక్తి ఈ నెల 15వ తేదీన దారుణ హత్యకు గురైన సంఘటన తెలిసిందే. అయితే జూకల్ గ్రామంలో గల మామిడి తోటలో వెంకట నాగరాజు అనే వ్యక్తి హత్య కేసును హత్యకు సంబంధించిన వివరాలు సిఐ శ్రీధర్ కుమార్ వెల్లడించారు. శంషాబాద్ మండలంలోని జుకల్ గ్రామ శివారులోని ఓ మామిడి తోట ఫౌంహౌస్‌లో సూపర్‌వేజర్‌గా పనిచేస్తున్న వెంకట నాగరాజు, భార్య నాగమణి ఇద్దరు నాలుగు నెలల నుండి నివాసం ఉంటున్నారు.
అయితే ఈ నెల 14వ తేదీ రాత్రి వెంకట నాగరాజు తాగి భార్య నాగమణి చిత్రహింసలు పెడుతున్నాడని నిద్ర పోతున్న నాగరాజును గొడ్డలితో నరికి చంపింది. అయితే విచారణలో భాగంగా హత్య ఎవరో చేసినట్లు దానిని కప్పిపుచ్చడానికి రాత్రి సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారని తన మొహంపై స్ప్రే జల్లడంతో సృహ తప్పి పడిపోయానని పుస్తెలతాడు సైతం లాక్కొని వెళ్లినట్లు అందరికీ అబద్ధం చెప్పినట్టుగా నాగమణి తెలిపింది.
రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని లోతుగా దర్యాప్తు చేయగా జరిగిన ఘోరాన్ని పోలీసులకు తెలిపింది. తన భర్త రోజు తాగి వచ్చి తనను మానసికంగా, శారీరకంగా చిత్రహింసలు పెడుతున్నాడని ఆ బాధ భరించలేక తనను గొడ్డలితో నరికి చంపానని పోలీసులకు తెలిపింది. ఈ కేసులో నిందితురాలైన నాగమణిని మంగళవారం అరెస్టు చేసి రిమాండ్ తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ శ్రీధర్‌కుమార్ తెలిపారు.