హస్తినాపురం: హస్తినాపురంలో బిఆర్‌ఎస్ నాయకులు శుక్రవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. నందనవనం బస్తీ కూడలిలో డివిజన్ అధ్యక్షులు సత్యంచారి ఆద్వర్యాన జరిగిన కార్యక్రమానికి స్తానిక మాజీ కార్పొరేటర్ రమావత్ పద్మానాయక్, నాయకులు గజ్జెల మధుసూధన్‌రెడ్డి, డేరంగుల కృష్ణ, భీమ్లానాయక్, గోపిసింగ్, శివారెడ్డి, నాగిరెడ్డి, మహిళా అధ్యక్షురాలు ఆదిలక్ష్మి, అనిత, కార్యకర్తలు పాల్గొని కేసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఙతలు తెలిపారు. ఎల్‌బినగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి నియోజకవర్గ అభివృద్ధికి అత్యధిక నిధులు మంజూరు చేసి పెద్ద స్థాయి సమస్యలన్నీ తీర్చి అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిపినందులకు ప్రత్యేక ధన్యవాదాలు ప్రకటిస్తున్నామని బిఆర్‌ఎస్ నాయకులు తెలిపారు.
ఫ్లై ఓవర్, స్కైఓవర్, అండర్ పాసు బ్రిడ్జిలు నిర్మించి సిగ్నల్ రహిత చౌరస్తాలు మార్చి ట్రాఫిక్ సమస్య తీర్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదని కొనియాడారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి ప్రత్యేక గౌరవం కల్పించి కోరిన వెంటనే 118 జి. ఓ.ఇచ్చి వేలాది పేద కుటుంబాలకు సహాయం చేసిన ఘనత శ్లాఘనీయమని ఆనందోత్సవం జరుపుకున్నారు. నాలాలు, రోడ్లు నిర్మాణం పూర్తి చేయించి, పార్కులకు కొత్త కల్పించి, టిమ్స్ ఆసుపత్రి నిర్మాణం చేపట్టి, ఎల్‌బినగర్ నుంచి హయత్‌నగర్ వరకు మెట్రో రైలు ట్రాక్ నిర్మాణానికి ఆమో దం ప్రకటించిన ముఖ్యమంత్రి పట్ల ఎల్‌బినగర్ నియోజకవర్గం ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నందున కృతజ్ఙతగా పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించామని బిఆర్‌ఎస్ నాయకులు తెలిపారు.