Monday, January 20, 2025

నేటితో ముగియనున్న పోస్టల్ ఓటింగ్ ప్రక్రియ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సౌకర్యం కల్పిస్తోంది. 80 ఏళ్లు పైబడిన సీనియర్ ఓటర్లకు, వికలాంగ ఓటర్లకు, కోవిడ్-19 సోకిన వ్యక్తులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పోస్టల్ ఓటింగ్ ప్రక్రియ శుక్రవారంతో ముగియనుంది. పోస్టల్ ఓటింగ్ కోసం 2.64 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు. నిన్న 1.76 లక్షల మంది ఎన్నికల సిబ్బంది పోస్టల్ ఓటు వేశారు. 80 ఏళ్లు పైబడిన వారిలో ఇంటి నుంచి 21,651 మంది ఓటు వేసినట్లు అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News