Monday, December 23, 2024

అధికారం మాదే

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో తదుపరి సిఎం బిజెపి నుంచే..

బిఆర్‌ఎస్‌తో కలిసే ప్రసక్తే లేదు

సెప్టెంబర్ 17ను విమోచన దినోత్సవంగా నిర్వహించాలి

ఖమ్మం సభలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా

మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో/హైదరాబాద్: బిఆర్‌ఎస్ పార్టీతో బిజెపి కలిసే ప్రసక్తే లేదని కేం ద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. బి ఆర్‌ఎస్ భుజస్కందాలపై మజ్లిస్ పార్టీ ఉన్నందున ఏనాటికైనా బిఆర్‌ఎస్‌తో బిజెపి చెలిమిచేయబోద ని ఆయన అన్నారు. ఆదివారం ఖమ్మం నగరంలో రైతు గోస–.. బిజెపి భరోసా పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే తెలంగాణలో పర్యటిస్తూ పచ్చి అ బద్ధాలు చెప్పారన్నారు. తెలంగాణలో బిజెపికి మా త్రమే ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణ లో కెసిఆర్‌ను ఇంటికి పంపించి బిజెపి అధికారం చేపట్టబోతుందని ఆయన అన్నారు.

తెలంగాణ లో బిఆర్‌ఎస్ పార్టీకి మజ్లిస్ పార్టీ మీద ఉన్న ప్రేమ తెలంగాణ ప్రజలందరికి తెలుసునని, కనీసం ఎం ఐఎం ఉన్న వేదికను కూడా తాము పంచుకోబోమ న్నారు. లక్షల కోట్లు తీసుకొని బిఆర్‌ఎస్‌కు బిజెపి స్నేహ హస్తం అందిస్తుందని ఖర్గే చేసిన ప్రకటనను ఆయన ఖండించారు. గతంలో యుపిఎ ప్రభుత్వంలో ఉన్న కెసిఆర్ ఆనాడు కాంగ్రెస్ పార్టీకి ఎన్నివే ల కోట్లు ఇచ్చారో ప్రజలకు చెప్పాలని అమిత్ షా డిమాండ్ చేశారు. యుపిఎ ప్రభుత్వంలో బిఆర్‌ఎస్ పార్టీ చేరి కేంద్రంలో మంత్రి పదవులను చేపట్టారని, మొన్నటి రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా బిఆర్‌ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధికి మద్దతు తెలిపారన్నారు. తెలంగాణలో బిఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల గుర్తు కారు అయినప్పటికీ కారు స్టిరింగ్ మాత్రం ఎంఐఎం చేతిలో ఉం టుందని, ఒవైసి కనుసన్నల్లోనే బిఆర్‌ఎస్ పార్టీ ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను చెప్పుకునే 4జీ పార్టీ అని, బిఆర్‌ఎస్ కెసిఆర్, కెటిఆర్ పేర్లు చెప్పుకునే 2జీ పార్టీ అని, ఎంఐఎం ముగ్గురు ఒవైసిల పేర్లు చెప్పుకునే 3జీ పార్టీ అని ఆయన ఎద్దేవా చేశారు.

తెలంగాణ సాయుధ పోరాటంలో రజాకార్ల దాష్టీకాన్ని చవిచూసిన తెలంగాణలో సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వర్తించకుండా ఎంఐఎం పార్టీ మెప్పుకోసం తెలంగాణ ప్రజలను వంచిచారని ఆయన అన్నారు. త ఏడాది జరిగిన తెలంగాణ విమోచన దినోత్సవంలో పాల్గొన్నడానికి తెలంగాణకువచ్చానని మళ్లీ సెప్టెంబర్17 తేదీ వస్తుందని, ఈసారి బిఆర్‌ఎస్‌ను హెచ్చరించడానికే తాను ఖమ్మం వచ్చానని ఆయన అన్నారు.

తెలంగాణలో కెసిఆర్ నిర్బంధం పెరిగింద ని బిజెపికి చెందిన కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటెల రాజేందర్ మీద అనేక అక్రమ కేసులను నమోదు చేశారని, సమావేశంలో ఈటేల గొంతు నొక్కేందుకు ప్రయత్నించారని ఆయన అన్నారు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం లో శ్రీరాముడి ఆలయాన్ని నిర్మించేందుకు భక్తరాందాస్ ఎన్నోకష్టాలు పడి చివరికి నిజం నవాబుల అదేశంతో 14 ఏళ్లపాటు జైలులో మగ్గినప్పటికీ భద్రాద్రిలో రామాలయాన్ని నిర్మించారని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఏటా శ్రీరామ నవమి రోజు ముఖ్యమంత్రులంతా స్వామి వారికి ప్రభుత్వం తరుపున పట్టువస్త్రాలను సమర్పించే అనవాయితి కొనసాగిందని, కాని తెలంగాణ వచ్చిన తరువాత ఆ సంప్రదాయాన్ని విస్మరించారని ఆయన అన్నా రు. బిజెపి జాతీయ నాయకురాలు బంగారు శ్రుతి అధ్యక్షతన జరిగిన ఈ బహిరంగ సభలో రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, జాతీయ కార్యదర్శి బండి సం జయ్ కుమార్, బిజెపి ఎన్నికల కమిటీ చైర్మన్ ఈ టెల రాజేందర్ ప్రసంగించగా బిజెపి జాతీయ నా యకులు తరుణ్ చుగ్, సునీల్ బన్సాల్, ప్రకాశ్ జా వదేకర్ , రాజ్యసభ స భ్యులు కె లక్ష్మణ్, తమిళనాడు రాష్ట్ర సహ ఇంచార్జ్,పొంగులేటి సుధాకర్ రెడ్డి,గరికపాటి రాంమోహన్ రావు,చింతల రాం చంద్రారెడ్డి, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి,డికె. అరుణ, రఘునందనరావు,సంకినేని వెంకటేశ్వర్ రా వు,దేవకి వాసుదేవరావు, గల్లా సత్యనారాయణ, కొండపల్లి శ్రీధర్ రెడ్డి,ఉప్పల శారద,రుద్రప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా బిజెపి నాయకులు ధనస్సును జ్ఞాపికగా అందించి భారీ గజమాలతో అమిత్‌షాను ఘనంగా సత్కరించారు.
అమిత్ షా సమక్షంలో చేరిన పలువురు ప్రముఖులు..
ఖమ్మంలో జరిగిన బహిరంగ సభ వేదికంగా హాం శాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో బిజెపిలో పలువురు ప్రముఖులు చేరారు. వారిలో మాజీ వి శ్రాంత ఐఎఎస్ అధికారి రామచంద్రుడు, డాక్టర్ కాళీప్రసాద్ (పరకాల నియోజకవర్గం), డాక్టర్ రఘునందన్ (మంచిర్యాల నియోజకవర్గం), గడ్డం సాయి కిరణ్ -(ఉప్పల్ నియోజకవర్గం), సం గీత (జడ్పీటీసీ – నెల్లికుదురు), పుప్పాల స్వప్న. (ఓయూ), గుగులోతు స్వరూప, అమిత్ కుమార్, బోడ పుణ్యనాయక్, కృష్ణ రాథోడ్, పిచ్చారెడ్డి, మాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ శ్యామ్‌రావు తదితరులు బిజెపిలో చేరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News