Thursday, January 23, 2025

రూ.54,000 దాటిన బంగారం

- Advertisement -
- Advertisement -

The price of 10 grams of gold crossed Rs 54,000

పెళ్లి సీజన్, ద్రవ్యోల్బణం వల్ల పెరిగిన డిమాండ్

న్యూఢిల్లీ : బంగారం, వెండి ధరలు పెగుతూనే ఉన్నాయి. పెళ్లిళ్ల సీజన్, అక్షయ తృతీయ పండుగల కారణంగా బంగారానికి డిమాండ్ మరింత పెరుగుతోంది. శుక్రవారం బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.54,000 దాటింది. అదే సమయంలో వెండి కిలో రూ.70,000లకు చేరుకుంది. శుక్రవారం హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.220 పెరిగి రూ.54,060 (24 క్యారెట్)కు చేరింది. దేశంలోని అనేక నగరాల్లోనూ ఇదే రీతిలో పెరిగింది.

గురువారం బంగారం ధర రూ.53,840గా ఉంది. దక్షిణ భారతదేశంలోని అనేక నగరాల్లో 10 గ్రాముల బంగారం ధర రూ.54,600కి లభిస్తోంది. మరోవైపు వెండి ధర కూడా పెరుగుతోంది. శుక్రవారం కిలో వెండి ధర రూ.700 పెరిగి రూ.70,000కి చేరుకుంది. అంతకుముందు రోజు కిలో వెండి ధర రూ.69,300గా ఉంది. అక్షయ తృతీయ పండుగ, పెళ్లి సీజన్ కారణంగా బంగారానికి డిమాండ్ పెరగ్గా, ఈ కారణంగా వీటి ధరలు రోజు రోజుకీ ఆకాశాన్నంటుతున్నాయి. ద్రవ్యోల్బణం నేపథ్యంలో ప్రజలు బంగారం సురక్షితమని భావించి, వీటిలో పెట్టుబడులు పెడుతున్నారు. చాలా రోజులుగా కొనసాగుతున్న రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కూడా బంగారానికి డిమాండ్‌ను పెంచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News