Monday, December 23, 2024

ప్రణాళిక ప్రకారం ప్రతికాలనీ సమస్యను పరిష్కరిస్తా

- Advertisement -
- Advertisement -

అల్వాల్: పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్ర తి కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నామని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. శనివారం అల్వాల్ సర్కిల్ 133 డివిజన్ మచ్చబొల్లారం డివిజన్ కౌకూర్‌లోని కావేరీ కాలనీ, వెంకుసా ఎస్టేట్‌లలో (అల్వాల్ సర్కిల్) ఆర్ డబ్ల్యూఏ అభ్యర్థనపై మేరకు నిర్వహించిన సమావేశాలలో స్థానిక కార్పొరేటర్ రాజేంద్రనాథ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. డ్రైనేజీ ఓవర్‌ఫ్లో, కమ్యూనిటీ హాల్, పార్క్ అభివృద్ధి, లైటింగ్, బ్యాలెన్స్ రోడ్లు వేయడం వంటి కొన్ని సమస్యలను ఎమ్మెల్యేకు తెలుపడంతో సంబంధిత శాఖకు ఫోన్ చేసి సమస్యలను పరిష్కరించారు. పాలు ఇబ్బందికర ప్రాంతాలను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీవాసులను ఆయన సన్మానించారు.

తమ దృష్టికి వచ్చిన సమస్యలు ఏవైనా పరిష్కరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ప్రతి సమస్యను ప్రణాళిక ప్రకారం పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాలలో ఏసీపీ వెంకట్ రెడ్డి, జవహర్ నగర్, అల్వాల్ సి ఐలు సీతారామ్, గంగాధర్, అల్వాల్ సర్కిల్ ఇంజనీరింగ్ విభాగం డిఇ మహేష్, జలమండలి డి జి ఎమ్ లు సాంబయ్య, భాస్కర్, మేనేజర్ లు అనిల్, మల్లికార్జున్, ఏఇ, రమేష్, శానిటరీ సూపర్వైజర్ ప్రభాకర్, విద్యుత్ దీపాల విభాగం ఏఈ స్వాతి, వర్క్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్రోజ్ ఇతర సిబ్బందితో పాటు డివిజన్ బిఆర్‌ఎస్ అధ్యక్షుడు బొబ్బిలి సురేందర్ రెడ్డి, శ్రీశైలం, మల్లికార్జున్, కొండయ్య, శ్రవణ్, శ్రీనివాస్ గౌడ్, వెంకటేష్, కొండయ్య, ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News