Wednesday, January 22, 2025

డ్రైనేజి సమస్య తల్లెత్తకుండా చూడాలి

- Advertisement -
- Advertisement -
  • సెవరేజ్ బోర్డు అధికారులకు కార్పొరేటర్ మెట్టు కుమార్ ఆదేశం

పటాన్‌చెరు: పటాన్‌చెరు పట్టణ పరిధిలోని డ్రైనేజి సమస్యలు తలెత్తకుండా చూడాలని జిహెచ్‌ఎంసి, సెవరేజ్ బోర్డు అధికారులను కార్పొరేటర్ ఆదేశించారు. గురువారం పటాన్‌చెరు వార్డు పరిధిలోని కటిక బస్తీలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ అధికారులతో కలసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ వీదుల్లో ఏర్పడుతున్న సమస్లను గుర్తించి వెను వెంటనే పనులు చేపట్టాలన్నారు.

కటికె బస్తీలో పర్యటిస్తున్న సందర్భంగా కాలనీవాసులు డ్రైనేజి సమస్యతోపాటు రోడ్ల సమస్యలు ఉన్నాయని కార్పొరేటర్ దృష్టికి తీసుకొచ్చారు. దానికి స్పందించిన కార్పొరేటర్ వెంటనే మరమ్మతులకు కావాల్సిన నిధుల అంచనా వేయాల్సిందిగా చెప్పారు. ఈ పర్యటనలో అధికారులు శివ కుమార్, ప్రవీణ్ కుమార్‌తోపాటు స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News