Monday, December 23, 2024

విద్యుత్ మీటర్ రీడింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : విద్యుత్ మీటర్ రీడింగ్ సమస్య లు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ మీటర్ రీ డర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి గుమ్మడి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఒక ప్రతినిధి బృందం విద్యుత్‌శాఖ మంత్రికి జగదీష్ రె డ్డి కి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు యూనియన్ నాయకులు మంత్రి జ గదీష్‌రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పిచారు.రాష్ట్ర లో సుమారు 2000 మంది మీటర్ రీడింగ్ కార్మికులు 23 సంవత్సరాల పని చే స్తున్నారని వారు సంస్థకు ఆదాయం అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు.

విద్యుత్ సంస్థలు మ మ్మల్ని మాసేవలను వినియోగించుకుంటున్నాయే. కానీ మాకు ఎటువంటి న్యాయం చేయటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఆవిర్భవించి పది సంవత్సరాలు దాటుతున్నా మా ఆర్దిక పరిస్ధితుల్లో ఎటువంటి మార్పు లేదని కుటుంబ పో షణ కూడా భారంగా మారిందన్నారు. మీటర్ రీ డింగ్ కార్మికులకు ఇచ్చే పీసు రేటు విధానం రద్దు చేసి నెలవారి పనిదినాలు కల్పించి కనీస వేతనం సౌకర్యం కల్పించాలన్నారు. మంత్రిని కలిసిన వారిలో 1535 యూనియన్ సెం ట్రల్ అధ్యక్షుడు వజీర్, యూనియన్ నాయకులు శ్రీనివాస్ ,కొం డాపూర్ శేఖర్ తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News