Wednesday, January 22, 2025

మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

- Advertisement -
- Advertisement -

ఆమనగల్లు: మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సిఐటియూ జిల్లా కమిటీ సభ్యులు గుమ్మడి కురుమయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీవో నెంబరు 8 ప్రకారం వేతనాలు, ఏరియర్స్‌తో సహ చెల్లించాలన్నారు. ఆమనగల్లు పట్టణంలోని మండల విద్యా వనరుల కేంద్రం ఎదుట మంగళవారం సిఐటియూ ఆధ్వర్యంలో మధ్యాహ్న బోజన కార్మికులు ఆందోళన చేపట్టారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తక్షణమే పెండింగ్‌లో ఉన్న బిల్లులు విడుదల చేయాలని, మార్కెట్ ధరలకు అనుగుణంగా కొత్తగా ప్రవేశపెట్టిన మెనును సవరించాలని, గుడ్లకు ప్రత్యేక బడ్జేట్ కేటాయించాలని వంటగ్యాస్‌ను సబ్సిడీకే అందజేయాలని, మధ్యాహ్న బోజన పథకాన్ని అక్షయ పాత్రలాంటి స్వచ్ఛంద సంస్థలకు అప్పజెప్పడాన్ని విరమించుకోవాలని, వంట సెట్లు, వంట పాత్రల వంటి మౌలిక సదుపాయాలను కల్పించాలని, కార్మికులకు కాటన్ బట్టల యూనిఫాంలు అందజేయాలని కోరారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించని యెడల జులై 14 నుంచి సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు.

ఈ సమ్మెలో పద్మ, పార్వతమ్మ, పెంటమ్మ, శంకరమ్మ, శాంతమ్మ, ఖజాబి, రజియాబేగం, సుగుణమ్మ, ఈశ్వరమ్మ, పార్వతమ్మ, అలివేలు, యాదమ్మ, ఎల్లమ్మ, అమీనా, సత్తమ్మ, కాశమ్మ, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News