Monday, December 23, 2024

పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

- Advertisement -
- Advertisement -
  • టిపిసిసి సభ్యుడు మర్రి నిరంజన్ రెడ్డి

మంచాల: గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టిపిసిసి సభ్యులు, మాజీ ఎంపిపి మర్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. పంచాయతీ కార్మికులు మండల కేంద్రంలో నిర్వహిస్తున్న సమ్మెకు గురువారం ఆయన సంఘీబావం తెలిపారు.

ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు, పంచాయతీల్లో ఇతర అన్ని రకాల పనులు చక్కబెట్టే కార్మికులకు రూ.8.500 వేతనం ఇస్తూ ప్రభుత్వం శ్రమదోపిడీ చేస్తోందన్నారు. కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలన్నారు. కార్మికులకు రూ.10 లక్షల బీమా కల్పించాలన్నారు. గ్రామాలను శుభ్రం చేసి అద్దంలా తీర్చిదిద్ది ప్రజల ఆరోగ్యాలను కాపాడుతుంటే ప్రభుత్వం వారి సమస్యలు పరిష్కరించకుండా వివక్షత చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

కరోనా సమయంలో తమ సొంత ఖర్చులతో పంచాయతీ కార్మికుల శ్రమను గుర్తించి నిత్యవసర సరుకులు, మాస్క్‌లు, ఆర్థిక సహాయం చేసినట్లు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పంచాయతీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి రాందాస్ నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు లింగంగౌడ్, కమలాకర్ రెడ్డి, శ్రీనివాస్ నాయక్, చరణ్ ముదిరాజ్, గోవర్ధన్ రెడ్డి, ధన్‌రాజు,కృష్ణ, సాయి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News