Monday, December 23, 2024

తెలంగాణ జర్నలిస్టుల సమస్యలను కాంగ్రెస్ మేనిఫేస్టోలో చేర్చాలి!

- Advertisement -
- Advertisement -

టిపిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డికి వినతిపత్రం అందజేసిన తెలంగాణ జర్నలిస్టు అధ్యయన వేదిక

మన తెలంగాణ/ హైదరాబాద్:  తెలంగాణ జర్నలిస్టుల సమస్యలను కాంగ్రెస్ మేనిఫేస్టోలో పొందుపరిచి, జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని టిపిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డిని తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక కోరింది. సోమవారం ఆ సంఘం అధ్యక్షులు వేణుగోపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సాదిక్ ఆధ్వర్యంలో కలిసి తెలంగాణ జర్నలిస్టుల సమస్యలు, సంక్షేమానికి సంబంధించి 9 ప్రధాన అంశాలతో కూడిన వినతిపత్రం అందజేశారు. అందుకు సానుకూలంగా స్పందించిన రేవంత్ రెడ్డి  పరిశీలనకు మేనిఫెస్టోలో పెట్టి,  కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి, సంక్షేమానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డిని కలిసిన వారిలో తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఉపాధ్యక్షులు కె. శ్రీనివాస్ రావు, జె. వెంకటేశ్వర్లు, సహాయ కార్యదర్శి మధు, కార్యదర్శి, ట్రెజరర్ సురేశ్  ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News