Thursday, November 21, 2024

మిడ్ మానేర్ బాధితుల సమస్యలు పరిష్కారించాలి

- Advertisement -
- Advertisement -

సిఎం రేవంత్‌ రెడ్డికి లేఖ రాసిన ఎంపి బండి సంజయ్

మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో కరీంనగర్ జిల్లా మిడ్ మానేరు ముంపు బాధితుల సమస్యను ప్రస్తావించడం అభినందనీయమని ఎంపి బండి సంజయ్‌కుమార్ పేర్కొన్నారు. సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బండి బహిరంగ లేఖ రాశారు. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న మిడ్ మానేరు బాధితుల సమస్యలను వివరిస్తూ ఒక్కో బాధిత కుటుంబానికి ఇళ్ల నిర్మాణానికి రూ. 5 లక్షల 4 వేలు చెల్లించాలని కోరారు.

నీలోజిపల్లి నుండి నందిగామ, ఆగ్రహారం వరకు ఇండస్ట్రీయల్ కారిడార్‌ను, స్కిల్ డెవలెప్ మెంట్ కాలేజీని ఏర్పాటు చేయాలన్నారు. అర్హత లేకున్నా మిడ్ మానేరు ముంపు ప్యాకేజీ పరిహారం తీసుకున్న ఓ ప్రజా ప్రతినిధి సహా వారి కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. తక్షణమే సంబంధిత శాఖ మంత్రి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని, త్యాగాల పునాదులపై ఏర్పడ్డ తెలంగాణలో ప్రజా అకాంక్షలకు అనుగుణంగా పాలన కొనసాగిస్తూ, ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయాలని సూచించారు. అదే విధంగా 2009 కొత్త గెజిట్ ప్రకారం 2015 నాటికి 18 ఏళ్లు నిండిన యువతీ,యువకులకు ముంపు పరిహారం, పట్టా ఇస్తానని ఇచ్చిన హామీ నేటికి ముందుకు పడలేదని, దీనిపై పరిశీలించాలని పేర్కొన్నారు. రెండేళ్ల క్రితం మిడ్ మానేర్ ముంపు బాధితుల కోసం కొదురుపాకలో నిర్వహించిన అఖిల పక్ష మహాధర్నాలో పాల్గొన్ని కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని, మాట నిలబెట్టుకోవాలన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News