Friday, November 22, 2024

రబీ సీజన్‌కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి

- Advertisement -
- Advertisement -
  • మెదక్ కలెక్టర్ రాజర్షి షా

మెదక్ ప్రతినిధి: జిల్లాలో రబీ సీజన్‌కు సంబందించి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ముగిసిందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా గురువారం తెలిపారు. 3,51,990 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అంచనా వేయగా 68,024 మంది రైతుల నుంచి 64కోట్ల 37 లక్షల విలువగల 3.12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుచేసి ధాన్యమంతా మిల్లులకు తరలించామన్నారు. కాగా 28,757 మంది రైతులకు చెందిన 1.12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబందించి 231కోట్ల 43 లక్షలు వారి ఖాతాలో జమా చేశామన్నారు. 86 శాతం టాబ్ ఎంట్రీ కూడా పూర్తయిందని,త్వరలో మిగతా రైతులు కూడా వారి ఖాతాలో డబ్బులు జమాచేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.

ధాన్యం కొనుగోళ్లతోపాటు మే నెలాఖరుకు సీఎంఆర్ రైస్ తరలించుటకు గడువు ఉన్నందున, ఆకాల వర్సాల వల్ల కాస్త ఇబ్బంది పడ్డా ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీసుల సహకారంతో 45 రోజులలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి చేశామన్నారు. గోదాముల స్థలాభావం కొరత దృష్టా రంగారెడ్డి, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలకు 30వేల మెట్రిక్ టన్నుల ధాన్యం తరలించడంతోపాటు నర్సాపూర్‌లో మూతపడ్డ అల్యూమినియం ప్యాక్టరీ, ఖండసారి షుగర్ ప్యాక్టరీ,కూచారంలో ప్రయివేట్ గోదాం ఇలా జిల్లాలో అవసరమైన ప్రాంతాలలో ప్రయివేట్ గోదాములు తీసుకుని ధాన్యం నిల్వ చేశామన్నారు.మంత్రుల దిశా నిర్దేశం, మార్గదర్శకాల మేరకు కొనుగోళ్ల ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం, అధికారులు, రెవెన్యూ, పోలీసు తదితర అందరి సహకారంతో రైతుల నుంచి పూర్తిగా ధాన్యం కొనుగోళ్లు చేసి ప్యాక్స్, ఐకెపి, మార్కెటింగ్ శాఖల ద్వారా ఏర్పాటు చేసిన అన్ని కొనుగోలు కేంద్రాలు మూసివేశామని కలెక్టర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News