Thursday, December 26, 2024

సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ల గుర్తింపు ప్రక్రియ సజావుగా నిర్వహించాలి

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ : వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ల గుర్తింపు ప్రక్రియ సజావుగా నిర్వహించాలని కలెక్టర్ ఉదయ్ కుమార్ ఆదేశించారు. శనివారం ఉదయ సమీకృత జిల్లా కార్యాలయంలో సముదాయం సమావేశ మందిరంలో ఎస్పి మనోహర్‌తో కలిసి సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ల గుర్తింపుపై స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నాగర్‌కర్నూల్ జిల్లాలో దాదాపు 760 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, వీటిలో సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు ఏమున్నాయో కారణాలతో సహా వివరిస్తూ నివేదిక ఇవ్వాలని స్టేషన్ హౌజ్ ఆఫీసర్లను ఆదేశించారు. 2018 అసెంబ్లీ ఎన్నికలను ప్రమాణికంగా చేసుకోవాలని సూచించారు.

గొడవలు జరిగిన పోలింగ్ స్టేషన్, క్రిమినల్ కేసులు ఎక్కువగా ఉన్న పోలింగ్ స్టేషన్, రెండు పొలిటికల్ పార్టీల మధ్య హోరాహోరీగా ఉన్న ప్రాంతం, కుల, మత విభేదాలు ఎక్కువగా ఉన్న పోలింగ్ స్టేషన్, 80 శాతం కన్నా అధికంగా పోల్ అయినవి లేదా 70 శాతం ఓట్లు ఒకే అభ్యర్థికి పోల్ అయి ఉంటే అలాంటి పోలింగ్ స్టేషన్ సంఖ్య ఏది ఏ నియోజకవర్గంలో వస్తుందనే పూర్తి విరవాలు తయారు చేసి ఇవ్వాలని తెలిపారు. లైసెన్స్ పొందిన మారణాయుధాలు ఎవరి దగ్గర ఉన్నాయో గుర్తించి తిరిగి జమ చేసుకోవాలని సూచించారు.

జిల్లా ఎస్పి కె. మనోహర్ మాట్లాడుతూ 2018 ఎన్నికల రోజున ఏదైనా పోలింగ్ స్టేషన్‌లో గొడవలు జరిగి ఉంటే అట్టి పోలింగ్ స్టేషన్‌ను సైతం సమస్యాత్మక పోలింగ్ స్టేషన్‌గా గుర్తించాలని అన్నారు. ఒకవేళ రాబోయే ఎన్నికల్లో గొడవలు జరిగే ప్రమాదం ఉంది లేదా ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఎస్‌హెచ్‌ఓలు భావిస్తే పూర్తి వివరాలతో కూడిన నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ సమావేశంలో నాగర్‌కర్నూల్ డిఎస్పి మోహన్ కుమార్, కల్వకుర్తి డిఎస్పి గిరిబాబు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, ఎన్నికల సెక్షన్ సూపరిండెంట్ జాకీర్ అలీ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News