Sunday, November 24, 2024

ఎస్‌ఆర్‌టి, టిఆర్‌టి కాలనీల్లో ఇళ్ల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సుగమం

- Advertisement -
- Advertisement -

ఖిలా వరంగల్: వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని లేబర్ కాలనీలో గల ఎస్‌ఆర్‌టి, టిఆర్‌టి కాలనీ వాసుల్లో ఆనందం వెల్లి విరిసింది. ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ప్రయత్నం ఫలిచింది. ఎట్టకేలకు 22 ఏళ్ల కల సాకారమైంది. కాలనీల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు ఎమ్మెల్యే నన్నపునేని మార్గం సుగమం చేశారు. దీంతో కాలనీవాసుల్లో సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. దీంతో శుక్రవారం కాలనీవాసులందరూ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చి ఎమ్మెల్యేను గజమాలవేసి శాలువాలతో సత్కరించి స్వీట్లు తినిపించి బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.

గతంలో ఆంజాం జాహి మిల్లు ఉన్నపుడు అందులో పనిచేసిన కార్మికుల కోసం ప్రస్తుత 18వ డివిజన్‌లోని ఎస్‌ఆర్‌టి, టిఆర్‌టి కాలనీల్లో స్థలాన్ని కేటాయించారు. ఆజాం జాహి మిల్లు మూతపడే సమయానికి కార్మికుల పేర ఆ భూమి రిజిస్ట్రేషన్ కాలేదు. వారికి కేటాయించిన భూమికి సంబంధించిన ఫైల్ కమిషనర్ వద్దే ఉండిపోయింది. గత 22 ఏళ్లుగా ఆ కార్మికులు ఎంతో మంది ఎమ్మెల్యేలు, అధికారుల చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదు.

తమ ఆశలు నెరవేరవని భావిస్తున్న తరుణంలో ఎమ్మెల్యే నరేందర్ వారి సమస్యను తన సమస్యగా భాశించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం జీవో తీసుకవచ్చి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. ఈ సమస్యను ఎమ్మెల్యే నేరుగా సిఎం కెసిఆర్, మంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాల్సిందిగా అభ్యర్థించగా ఎమ్మెల్యే ప్రయత్నం సఫలీకృతమైంది. ఈ సందర్భంగా ఎస్‌ఆర్‌టీ, టీఆర్‌టీ కాలనీ పెద్దలు, ప్రజలు, స్థానిక కార్పొరేటర్, నాయకులు, కాలనీవాసులు ఎమ్మెల్యేకు రుణపడి ఉంటామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News