Saturday, November 23, 2024

రోగుల ప్రాణాలు కాపాడే వైద్య వృత్తి ఎంతో పవిత్రం

- Advertisement -
- Advertisement -

గోషామహల్: పేద రోగులకు నిస్వార్థ్దంగా వైద్యం అందించి వారి ప్రాణాలు కాపాడే వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనదని ఉస్మానియా ఆ సుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి నాగేందర్ అన్నారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్బంగా శనివారం ఉస్మానియా ఆసుపత్రిలో నిర్వహించిన వే డుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని, ఆసుపత్రి అదనపు సూపరింటెండెంట్ డాక్టర్ బి త్రివేణి, సివిల్ సర్జన్ ఆర్‌ఎంవో=1 డాక్టర్ బి శేషాద్రిలతో కలిసి ప్రత్యేకంగా తయారు చేయించిన“డాక్టర్స్ డే”’ కేక్‌ను కట్ చేసి, వైద్యులకు తినిపించారు. ఈ సందర్బంగా డాక్టర్ నాగేందర్ మాట్లాడుతూ అత్యంత పవి త్రమైన వైద్య వృత్తిలో కొనసాగుతున్నందుకు మనమంతా గర్వించాలని అన్నారు. వైద్య వృత్తిలో కొనసాగుతున్న వైద్యులంతా సంపాదన కోసం కాకుం డా సేవా భావంతో పేద రోగులకు వైద్యసేవలు అందిస్తున్నారని అన్నారు.

ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలోనూ వైద్యులు, సిబ్బంది తమ కుటుంబాలను వదిలి, ప్రాణాలను కూడా లెక్క చేయకుండా కరోనా రోగులకు వైద్యసేవలు అందించారని ఆయన గుర్తు చేశా రు. ప్రపంచంలో ఏ వృత్తికీ దక్కని గౌరవం ఒక్క వైద్య వృత్తికి మాత్రమే దక్కిందని, అలాంటి పవిత్రమైన వైద్య వృత్తిలో కొనసాగడం మన అదృష్టంగా భా వించాలన్నారు. మున్ముందు ఇదే స్పూర్తిని కొనసాగిస్తూ, ఆసుపత్రికి వచ్చే రోగులకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించాలని కోరారు. అనంతరం భాగ్యనగర్ అయ్యప్ప సేవాసమితి అధ్యక్షులు క్యాతం రాధాకృష్ణ నేతృత్వంలో ప్రతినిధుల బృందం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి నాగేందర్, అ దనపు సూపరింటెండెంట్ డాక్టర్ త్రివేషి, సివిల్ సర్జన్ ఆర్‌ఎంవో=1 డాక్టర్ శేషాద్రి, డిప్యూటీ సివిల్ సర్జన్ ఆర్‌ఎంవోలు డాక్టర్ సా యిశోభ, డాక్టర్ బండా రి శ్రీనివాసులు, అసిస్టెంట్ సివిల్ సర్జన్ ఆర్‌ఎంవోలు డాక్టర్ అనురాధ, డాక్టర్ మాధవి, డాక్టర్ కవిత, డాక్టర్ మహ్మద్ రఫీ, డాక్టర్ విజయ భాస్కర్‌లకు పు ష్పగుచ్చాలు అందించి, శాలువాలతో ఘనంగా సత్కరించి, వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News