Monday, December 23, 2024

లాభాల వాటా కార్మికుల ఖాతాల్లో జమ చేయాలి

- Advertisement -
- Advertisement -
  • సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ కొరిమి రాజ్‌కుమార్

భూపాలపల్లి కలెక్టరేట్: కార్మికులకు యాజమాన్యం ఇచ్చిన మాట ప్రకారం ఈ నెల 16న లాభాల వాటా కార్మికుల ఖాతాలో వెంటనే జమ చేయాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ కెఐటియూసి ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్, బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్‌లు డిమాండ్ చేశారు.

సోమవారం భూపాలపల్లి ఏరియాలో కెటికె 5, 6 ఇంక్లైన్‌లో, ఓసి త్రి గని, ఏరియా హాస్పటల్ నిరసన తెలియజేసి మేనేజర్‌లకు ఏఐటియూసి ఆధ్వర్యంలో మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 32 శాతం లాభాల వాటా ప్రకటించిన యాజమాన్యం ఇప్పుడు ఎన్నికల కోడ్‌ని సాకుగా చూపించి యాజమాన్యం కార్మికులకు మభ్యపెట్టడం తగదని అన్నారు. ముందుగా అనుకున్న ప్రకారం కార్మికులకు రావాల్సిన లాభాలను వెంటనే ఎన్నికల కోడ్ రాకముందే యాజమాన్యం సర్కూలర్ జారీ చేయడం జరిగిందని, కావున ఎన్నికల కోడ్‌కు మనకు రావాల్సిన లాభాలకు ఎటువంటి సంబంధం లేదన్నారు. ఇది పూర్తిగా సింగరేణి సంస్థ చెల్లిస్తుందని కార్మికులు తమ యొక్క రక్తాన్ని చెమటగా మార్చి సాధించిన లాభాలు కార్మికుల హక్కును ప్రభుత్వ డబ్బు కాదు. కార్మికులకు చెల్లించేది కార్మికుల యొక్క కష్టార్జితం కాబట్టి వెంటనే లాభాల వాటా చెల్లించాలని ఏఐటియూసి డిమాండ్ చేశారు.

లేనిపక్షంలో తీవ్రంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ కమిటీ మెంబర్ చంద్రమౌళి, ఆసిఫ్ పాషా, దోర్నాల తిరుపతి, గోవిందుల తిరుపతి, ఆర్గనైజింగ్ సెక్రటరీ కృష్ణమూర్తి, వర్క్‌మెన్ ఇన్స్‌స్పెక్టర్ రాజన్న, పిట్ కార్యదర్శి శ్రీను, అసిస్టెంట్ పిట్ సెక్రటరీలు ఎల్ శంకర్, అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ విజేందర్, ఓసి త్రి సెక్రటరీ కృష్ణారెడ్డి, డి శ్రీకాంత్, తాళ్ల పోశం, నల్ల రమేష్, సేఫ్టీ కమిటీ సభ్యులు, మైన్స్ కమిటీ సభ్యులు, టెంపుల కమిటీ సభ్యులు, కార్యకర్తలు, కార్మిక సోదరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News