Sunday, December 22, 2024

కాంగ్రెస్ లో చేరుబోతున్నట్లు వస్తున్న ప్రచారం అవాస్తవం

- Advertisement -
- Advertisement -

తమ పార్టీ కార్పొరేటర్ ఇంట్లో జరిగిన విందుకు హాజరు
దీంట్లో ఎలాంటి రాజకీయ కారణాలు లేవని ఖండించిన ఈటెల రాజేందర్

మన తెలంగాణ/హైదరాబాద్: ఇటీవల కాంగ్రెస్ నాయకులతో మాజీ మంత్రి, బిజెపి సీనియర్ నేత ఈటల రాజేందర్ భేటీ కావడం రాజకీయంగా దుమారం రేపింది. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలు బయటకు రావడంతో ఈటల కమలం పార్టీకి దూరమైతున్నట్లు ప్రచారం జోరందుకుంది. దీనిపై ఈటెల స్పందిస్తూ కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు వచ్చిన వార్తలను ఖండించారు. అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఈటల రాజేందర్ బిఆర్‌ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి చేతిలో ఘోర ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి ఈటల పార్టీకి దూరంగా ఉంటూ రాజకీయాలపై మౌనంగా ఉంటున్నారు. పార్టీ పలుసార్లు సమావేశాలు జరిపినా చురుగ్గా పాల్గొనడం లేదు. దీంతో ఈటల పార్టీ మారబోతున్నారని ప్రచారం మొదలైంది.

కాంగ్రెస్ నాయకులతో ఆయన విందు చేస్తున్న ఫొటోలు ఇటీవల బయటకు రావడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చాయి. ఆ ఫొటోలను చూపిస్తూ ఈటల కాంగ్రెస్‌లో చేరినట్లు ప్రచారం ఎక్కువయ్యింది. ఈ క్రమంలో స్పందించిన ఈటల రాజేందర్ కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు వచ్చిన వార్తలను ఖండించారు. ఓ కార్పొరేటర్ గృహప్రవేశ కార్యక్రమంలో అందరితో కలిసి భోజనం చేశానని ఆ సమయంలో తీసిన ఫొటోపై దుష్ప్రచారం చేయడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News