Monday, January 20, 2025

లక్షల కోట్లతో ప్రాజెక్టులు కట్టిన ప్రయోజనం శూన్యం

- Advertisement -
- Advertisement -

నవీపేట్: రాష్ట్రంలో లక్షల కోట్లతో ప్రాజెక్టులు కట్టిన ప్రయోజనం శూన్యంమని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డీ మోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని మండలంలోని అలీసాగర్ లిప్ట్ ఇరిగేషన్ ఎత్తిపోతల పథకాన్ని మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యవసాయ శాఖమంత్రి నిరంజన్ రెడ్డి వ్యవసాయ శాఖ అధికారుల సూచన మేరకు నెల ముందు నార్లు వేసుకోవడం జరిగిందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం లక్షల కోట్లు వెచ్చించి ప్రాజెక్టులు కట్టిన, రైతుల ఒరిగింది శూన్యమని ఎద్దేవా చేశారు. అధికారులు వెంటనే పంప్ హౌస్‌కి నీరు అందించే ప్రధాన కాలువలో ఉన్న ఒండ్రు మట్టి పూడికను తొలగించాలని అన్నారు.

బోధన్ శాస నసభ్యులు వెంటనే నీటిని వదిలి ఆయకట్టు రైతాంగాన్ని ఆదుకోవాలన్నారు. కార్యక్రమంలో నాగేపూర్ సొసైటీ చైర్మన్ శైలేష్ కుమార్ శేశ్‌ముఖ్, వైస్ చైర్మన్ సత్యం రెడ్డి, బిజెపి మండల ప్రధాన కార్యదర్శి బందెల ఆనంద్, మేక రామకృష్ణ రైతు నాయకులు మొవ్వ నాగేశ్వరరావు, సత్యనారాయణ, వంశీ మోహన్, కోగంటి ప్రసాదరావు, బెజ్జం రామాంజనేయ రెడ్డి, యువజన నాయకులు రాజేందర్ గౌడ్, నాగభూషణం, సొసైటీ డైరెక్టర్లు గణేష్, కాంతం రెడ్డి, రాము, ఎంపిటిసి మైసా రాధ, ఆయకట్టు రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News