Monday, January 20, 2025

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే శాఖ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్:  నిరుద్యోగులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. దేశ వ్యాప్తంగా తొమ్మిది వేల టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సంబంధిత శాఖ అధికారులు నోటిపికేషన్‌ను కూడా విడుదల చేసింది. మొత్తం 9 వేల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా.. అందుతో గ్రేడ్-1 సిగ్నల్, 1100, గ్రేడ్-3 పోస్టులకు 7,900 అందుబాటులో ఉన్నాయని తెలిపింది.

ఉద్యోగానికి సంబంధించిన ఆర్హతలను కూడా నోటిఫికేషన్లో అధికారులు వెల్లడించారు. ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలని అనుకన్న వారు అభ్యర్థుల వయసు 18 నుంచి 33 ఏళ్ల వయసు మధ్య ఉండాలి. గ్రేడ్-1 సిగ్నల్ పోస్టుకు రూ.29,200 రూపాయలు, గ్రేడ్-3 పోస్టుకు రూ.19,900 బేసిక పేగా వేతనాన్ని నిర్ణయించారు. అర్హులైన అభ్యర్థులు ఎవరైనా ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తు చేసుకోవచ్చు వచ్చే నెల 9 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకూ దరఖాస్తులను స్వీకరించనున్నట్లు రైల్వేశాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News