- Advertisement -
గద్వాల టౌన్: తెలంగాణలో నైరుతి రుతపవనాలు రావడంతో జోగుళాంబ గద్వాల జిల్లాలో వాతావరణ ఒక్కసారి మారిపోయింది. నైరుతి ప్రభావంతో రెండు రోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా ఆయా మండలాల్లో వర్షాలు మొదలయ్యాయి. గత కొన్ని రోజులుగా అధిక ఉష్ణోగ్రతలతో ఉడికెత్తిపోయిన ప్రజలను చల్లబడ్డ వాతావరణం సేదతీరుస్తోంది.
అంతే కాకుండా ఎండ తీవ్రతలకు పంటలు ఎండిపోయాయి. జూన్ తొలివారంలో రావల్సిన నైరుతి అఖరి వారంలో రావడంలో రైతులకు కొంత ఉపసమనం కలిగించింది. అయితే సరైన సమయంలో వర్షాలు రాకపోవడంతో పత్తి పంటలకు ఎర్రతెగులు సోకి తీవ్రం నష్టం వాటిలింది. జిల్లా వ్యాప్తంగా శనివారం, ఆదివారాలు మోస్తారు వర్షం కురుస్తుండటంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేశారు.
- Advertisement -