Monday, December 23, 2024

కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం బయటపడింది

- Advertisement -
- Advertisement -

జమ్మికుంట: బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాల అమలుపై రేవంత్‌రెడ్డి మాటలతో కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం బయటపడిందని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ అన్నారు. తానా సభలలో రేవంత్‌రెడ్డి రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపులో భాగంగా బుధవారం పార్టీ పట్టణ అధ్యక్షుడు టంగుటూరి రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో బస్‌స్టాండ్‌లో ధర్నా, రాస్తారోకో నిర్వహించి పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్సీ కార్పొరేష్‌న్ చైర్మన్ బండ శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోవడం లేదని అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులకు సాగుకోసం 24గంటల ఉచితంగా విద్యుత్‌ను ఇస్తుంటే దాన్ని జీర్ణించుకోలేని పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తానా సభలలో రైతులకు సాగుకోసం 3గంటలు ఉచిత విద్యుత్ ను ఇస్తే సరిపోతుందని మాట్లాడి రైతులపై కాంగ్రెస్ పార్టీకి ఉన్న నిజస్వరూపాన్ని బయట పెట్టారని అన్నారు.

రానున్న అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే బిఆర్‌ఎస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగదని తేల్చి చేప్పారు. నిరసన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావు, వైస్‌చైర్ పర్సన్ దేశిని స్వప్నకోటి, జడ్పీటీసీ డాక్టర్ శ్రీరాం శ్యాం, పిఎసిఎస్ చైర్మన్ పి.సంపత్, కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News