చిరంజీవి తమ్ముడు అయినంత మాత్రాన సినిమాలు ఎవరూ ఇవ్వరని కష్టపడే తత్వం ఉండాలని ఆయన సోదరుడు, నిర్మాత కె. నాగబాబు అన్నారు. శనివారం హైదరాబాద్‌లో పవన్ కల్యాణ్‌పై గణ రచించిన ‘ది రియల్ యోగి’ అనే పుస్తకాన్ని నాగబాబు ఆవిష్కరించి మాట్లాడారు.. పవన్ కళ్యాణ్ మోస్ట్ కంపర్టబుల్ అని, చిన్నప్పటి నుంచి ఒంటరిగా ఉండేవాడని అన్నారు. విలువలతో బతుకుతున్న పవన్ కళ్యాణ్ ఏదైనా స్వచ్చంధ సంస్థ పెట్టుకుని సేవ చేస్తే కొద్దిమందికే చేరుతుందని అన్నారు.
అయితే కోట్లాది మందికి సేవ చేయాలనే లక్షంతో రాజకీయాలే కరెక్టు అని భావించి అందులోకి ప్రవేశించాడని చెప్పారు. తన దగ్గర పిల్లలు కోసం దాచుకున్న డబ్బులన్నీ ఖర్చు పెట్టి జనసేన పార్టీ పెట్టినట్లు ఆయన వెల్లడించారు. పదవే కావాలంటే బిజెపిలో చేరితే ఎప్పుడో మంత్రిపదవి దక్కేదని అన్నారు. కానీ సొంతంగా పార్టీ పెట్టుకుని లంచగొండి, అవినీతిపరులను నిలదీయడానికే పవన్ పార్టీ పెట్టాడని ఆయన తెలిపారు.