- Advertisement -
హైదరాబాద్: బుధవారం జరిగిన ఎఐసిసి సమావేశంలో రాహుల్ గాంధీ మెచ్చెకున్నారని.. ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. మాజీ మంత్రి హరీశ్ రావు కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై విషం చిమ్ముతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచార లోపం వల్లే రాహుల్ గాంధీ బిసి దీక్షకు రాలేదని.. హరీశ్‌రావు కావాలనే తమ పార్టీపై విషప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. తమ పార్టీలో పిసిసి అధ్యక్షుడిగా బిసి ఉన్నారని.. భారానసలో అలాంటి పరిస్థితి ఉందా అని అడిగారు. రానున్న భారాస ఆవిర్భావ దినోత్సవం రోజున ఆ పార్టీకి బిసిని అధ్యక్షుడిని చేస్తారా అని సవాల్ విసిరారు.
- Advertisement -