Monday, December 23, 2024

మనుషుల మధ్య అంతరాలకు కారణం బిజెపి, కాంగ్రెస్సే

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట : పమనుషుల మధ్య అంతరాలను సృష్టించి బిజెపి కాంగ్రెస్ పార్టీలు పాలన సాగించాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ లో బిజెపి కాంగ్రెస్ పార్టీల నుండి నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలో ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 2014 తరువాత తెలంగాణలో వచ్చిన మార్పునకు కారణం కేసీఆర్ అయితే.. దేశంలో అభివృద్ధికి ఆటంకం ప్రధాని మోడీ అన్నారు.

సూర్యాపేట నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌లోకి చేరికల జోరు కొనసాగుతున్నది. రాష్ట్రం లో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధికి తోడుగా నియోజకవర్గంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారని చెప్పరు. పార్టీలో చేరిన వారిలో బి జె పి దళిత మోర్చ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు,ఎస్సీ సెల్ జిల్లా నాయకులు,వల్డాస్ ఉపేందర్, బిజెపి 20 వ వార్డు అద్యక్షుడు సోమగాని లక్ష్మణ్, బిజెపి 35 వ వార్డుఅద్యక్షుడు బల్గూరి రాజు,బిజె పి 17 వ వార్డు అధ్యక్షుడు మెరుగు మదన్ తో పాటు 500మంది బిజెపి కార్యకర్తలు ఉన్నారు.

మున్సిపల్ వైస్ చైర్మెన్ పుట్టా కిషోర్ అధ్యక్షత న జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్రావు, బిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్, జిల్లా గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మునిసిపల్ చైర్మన్ పెరుమాల అనుపూర్ణ, జడ్పి వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్, టిఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షులు సవరాల సత్యనారాయణ, టిఆర్‌ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి బూర బాల సైదులు గౌడ్, కౌన్సిలర్లు సౌమ్య జానీ, జ్యోతి కరుణాకర్, రాజేష్, కుంభం రాజేందర్, టిఆర్‌ఎస్ పట్టణ మహిళా అధ్యక్షురాలు కరుణశ్రీ, తండు శ్రీనివాస్, ఈదా ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News