Saturday, November 23, 2024

దక్షిణాదిని పుట్టి ముంచనున్న పునర్విభజన

- Advertisement -
- Advertisement -

దారుణంగా పడిపోనున్న లోక్‌సభ స్థానాల సంఖ్య

ఉత్తరాది రాష్ట్రాల్లో భారీగా పెరగనున్న సీట్లు నియోజకవర్గాల
పునర్విభజనకు జనాభా ప్రాతిపదిక వద్దంటున్న దక్షిణాది రాష్ట్రాలు

(స్పెషల్ డెస్క్)
నియోజకవర్గాల పునర్విభజన కత్తి దక్షిణాది రా ష్ట్రాలపై వేలాడుతుందంటూ తమిళనాడు ముఖ్యమంత్రి, డిఎంకె అధ్యక్షుడు స్టాలిన్ వ్యక్తం చేసిన ఆందోళన అక్షర సత్యం. జనాభా నియంత్రణ ను చిత్తశుద్ధితో అమలు జరిపిన ఫలితం ఇది. జ నాభా ప్రాతిపదికగా పార్లమెంట్ నియోజకవర్గాలను పునర్విభజించాలన్న ప్రాతిపదిక చైతన్యవంతమైన దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాబల్యానికి ఎసరు తెచ్చిపెడుతున్నది. మహిళా రిజర్వేషన్‌బిల్లు ఆమోదించిన తరువాత జరిగే తొలి జనగణన తరువాత నియోజకవర్గాల పునర్విభజన చేపట్టి.. మహిళా రిజర్వేషన్‌లను అమలు జరుపుతామని హోమ్ మంత్రి అమిత్ షా బుధవారంనాడు లోక్‌సభలో చెప్పారు. దీంతో.. మళ్లీ నియోజక వర్గాల పునర్విభజన అంశం తెరమీదకు వచ్చింది. జనాభానే ప్రాతిపదికగా తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాలకు లోక్‌సభ సీట్ల సంఖ్య తగ్గే ప్రమాదం ఉందని ఇప్పటికే అనేక అధ్యయనాలు రుజువు చేశాయి. తాజాగా కార్నేజ్ ఎండోమెంట్ అనే స్వచ్ఛంద సంస్థ ఓ నివేదికను విడుదల చేసింది.

వాషింగ్టన్ నుంచి పనిచేసే ఈ సంస్థ దక్షిణాది రాష్ట్రాలకు జరగబోయే అన్యాయాన్ని ఎలుగెత్తి చాటింది. ప్రస్తుత ఎంపీ స్థానాలకు 1971 నాటి జనగణన ప్రాతిపదిక. ఆ లెక్క ప్రకారం తెలంగాణకు 17, ఆంధ్రప్రదేశ్‌కు 25 లోక్‌సభ స్థానాలున్నాయి. 2026 నాటికి ఈ రెండు రాష్ట్రాలలో జనాభా సంఖ్య ఇప్పుడున్నదానికన్నా భారీగా తగ్గుతుంది. దీంతో రెండు రాష్ట్రా లు కలిసి కనీసం ఏడెనిమిది స్థానాలు కోల్పోతాయని ఈ సంస్థ అంచనా వేస్తున్నది. ప్రసుతం ఈ రెండు రాష్ట్రాలకు కలిపి 42 లోక్‌సభ స్థానాలుంటే.. కొత్తగా జరిగే పునర్విభజన తరువాత వాటి సంఖ్య 34కు పడిపోతుందని కార్నేజ్ ఎం డోమెంట్ స్పష్టం చేసింది. ఒక్క తెలంగాణ విషయానికే వస్తే మూడు నుంచి నాలుగు స్థానాల ను కోల్పోవలసి ఉంటుంది. 2011 జనాభా లెక్కలనే గనుక పరిగణనలోకి తీసుకుంటే తెలుగు రాష్ట్రాలలో లోక్‌సభ సీట్ల సంఖ్య 37 కు తగ్గవచ్చు. అలాకాక 2026లో జరిగే జనగణనను ప్రాతిపదికగా తీసుకుంటే వీటి సంఖ్య 34కు పడిపోతుంది. ఇక మొ త్తం దక్షిణాది రాష్ట్రాలను తీసుకుంటే.. తాజాగా జరిగే పునర్విభజనలో వీటి ప్రాతినిధ్యం దారుణంగా పడిపోతుంది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాలకు ప్రస్తుతం 129 లోక్‌సభ స్థానాలున్నాయి. తాజా పునర్విభజనలో వీటి సంఖ్య 103కు పడిపోతుందని కార్నేజ్ ఎండోమెంట్ తన నివేదికలో తేల్చి చెప్పింది. అదే.. ఉత్తరాదిలోని ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్ రాష్ట్రాలలో లోక్‌సభ స్థానాల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుంది. ప్రస్తుతం ఈ నాలుగు రాష్ట్రాలలోని లోక్‌సభ స్థానాల సంఖ్య 174 కాగా పునర్విభజనతో వీటి సంఖ్య ఏకంగా 204 స్థానాలకు చేరుకుంటుంది. పశ్చిమబెంగాల్, ఒడిషా కూడా భారీగా నష్టపోనున్నాయి. దాదాపు అన్ని ఉత్తరాది రాష్ట్రాలలో లోక్‌సభ స్థానాల సంఖ్య పెరగనున్నది. అదే దక్షిణాది రాష్ట్రాలలో తగ్గిపోనున్నది.

దీంతో పార్లమెంట్‌లో దక్షిణాది రాష్ట్రాల ప్రాబల్యం తగ్గిపోవడం ఖాయం. అందుకే దక్షిణాది రాష్ట్రాలు నియోజకవర్గాల పునర్విభజనకు జనాభాను ప్రాతిపదికగా తీసుకోకూడదని డిమాండ్ చేస్తున్నాయి. అందులో భాగమే.. స్టాలిన్ ప్రకటన. అయితే.. ఈ అంశంపై దక్షిణాది రాష్ట్రాలు ఆందోళనలు వ్యక్తం చేయడం ఇదే తొలిసారి కాదు.. బిఆర్‌ఎస్ అధ్యక్షు డు, తెలంగాణ సిఎం కెసిఆర్, ఐటి పరిశ్రమల శా ఖ మంత్రి కెటిఆర్ అనేక సందర్భాలలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ప్రగతిశీల దక్షిణాది రాష్ట్రాలు సీట్లు కోల్పోవడం.. అదే సమయంలో ఉత్తరాది రాష్ట్రాలలో సీట్లు పెరగడం దురదృష్టకరమని కెటిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో జనాభాను నియంత్రించడంలోనే కాకుండా మానవ అభివృద్ధి సూచికల్లో కూడా దక్షిణాది రాష్ట్రాలు అగ్రస్థానం లో ఉన్నాయి. అంతెందుకు.. దేశ జనాభాలో కేవలం 18 శాతం ఉన్న దక్షిణాది రాష్ట్రాలు జిడిపి లో 35 శాతం ఆదాయాన్ని అందిస్తున్నాయని కెటిఆర్ గతంలో ఓ సందర్భంలో అన్నారు.

జనాభా నియంత్రణను విజయవంతంగా అమలు జరిపినందుకు దక్షిణాది రాష్ట్రాలు దారుణంగా నష్టపోతుండగా.. జనాభా నియంత్రణలో పూర్తిగా విఫల మై.. జనభా విస్ఫోటంతో నానా అవస్థలు పడుతు న్న ఉత్తరాది రాష్ట్రాలు మాత్రం లబ్ధి పొందడం వైచి త్రి కాకమరేమిటి అని దక్షిణాది రాష్ట్రాల నేతలు వాపోతున్నారు. నియోజకవర్గాల పునర్విభజనకు కేవలం జనాభాను మాత్రమే ప్రాతిపదికగా తీసుకోకూడదని ఈ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా రు. అందుకే స్టాలిన్ నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం వాటిల్లదని హామీ ఇవ్వాలంటూ ప్రధాని మోడీని డిమాం డ్ చేశారు. నిజానికి.. అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెంచాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు గత కొంత కాలంగా కోరుతున్నాయి. రాష్ట్ర విభజన స మయం నుంచి ఈ డిమాండ్ ఉంది. ప్రస్తుత 119 అసెంబ్లీ స్థానాలను 153 కు పెంచాలని తెలంగాణ కోరుతున్నది. అదేవిధంగా 175 అసెంబ్లీ స్థానాలను 225కు పెంచాలని ఎపి కోరుతున్నది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News