Tuesday, January 21, 2025

భారత్, మాల్దీవుల సంబంధాలు మరింత బలపడాలి

- Advertisement -
- Advertisement -

నాంపల్లి : తెలంగాణ ఫ్యాప్సీ కార్యాలయాన్ని మాల్దీవుల మహిళా వ్యాపార మహిళా ప్రతినిధులు సందర్శించారు. భారత్, మాల్దీవుల మద్య సత్ససంబంధాల పటిష్ఠం, అన్ని రంగాల్లో పరస్పరంగా సహకరించుకోవడం వంటి అంశాల గురించి ఫ్యాప్సీ ప్రతినిధులతో మాల్దీవుల మహిళా వ్యాపారులు చర్చించారు. ఈ మేరకు గురువారం రెడ్‌హిల్స్‌లోని తెలంగాణ ఫెడరేషన్ హౌస్‌లో ఇరు దేశాల మద్య ద్వైపాక్షిక వ్యాపార, వాణిజ్య సంబంధాల వృద్దికి గల అవకాశాలను అన్వేషించడానికి వారు తెలంగాణ ఫ్యాప్సీ ప్రతినిధులతో భేటీ అయ్యారు.

ఆదేశ ఆర్థికశాఖ మంత్రి నీజా ఇమాద్, సహాయ మంత్రి మరియం నజిమా సారధ్యంలో పలువురు మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ ఫ్యాప్సీ అధ్యక్షుడు అనీల్ అగర్వాల్, సీనియర్ ఉపాధ్యక్షుడు మీలా జయదేవ్, ప్రతినిధులు సురేశ్‌కుమార్‌లు వారితో చర్చలు జరిపారు. మహిళా సాధికారత కమిటీ ఛైర్మన్ భగవతిదేవి, సంస్థ సీఈవో ఖ్యాతి నరవణే, డిప్యూటీ సీఈవో టి.సుజాత తదితరులు పాల్గొన్నారు. అనీల్ అగర్వాల్ మాట్లాడుతూ భారత్ దేశం అన్ని రంగాల్లో శరవేగంగా పురోగతితో వెలిగిపోతుందన్నారు. స్టార్టఫ్ స్టేట్‌గా తెలంగాన మంచి పనితీరు కనబరుస్తోందని కొనియాడారు. 1967లో మాల్దీవుల దేశం స్వాతంత్రం పొందినపుడు తొలుత గుర్తించింది భారత్‌దేశమని వెల్లడించారు.

రెండు దేశాల మద్య సత్ససంబంధాలు ధృడంగా ఉన్నాయని, మాల్దీవుల దేశం భౌగోళికంగా చిన్నదైన పర్యాటక రంగం పురోగతి దిశలో వెళుతోందన్నారు. మాల్దీవుల ఆర్థికశాఖమంత్రి నిజా ఇమాద్ మాట్లాడుతూ తాము నాలుగు రోజుల నిమిత్తం నగరానికి వచ్చామని, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రొత్సాహాం కల్పించడం ఈ పర్యాటన ఉద్దేశమన్నారు. సుస్రత్ రషీద్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News