Tuesday, April 1, 2025

‘వారసుడు’ రిలీజ్ డేట్ ఖరారు

- Advertisement -
- Advertisement -

The release date of 'Varasudu' has been finalized

దళపతి విజయ్ కధానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పీవీపీ బ్యానర్‌పై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ’వారసుడు’/వారిసు’ చివరి షెడ్యూల్ మినహా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని 2023 సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో కూడా సంక్రాంతి అతిపెద్ద పండుగ కావడంతో మేకర్స్ పండుగ సీజన్‌ను సద్వినియోగం చేసుకోవడానికి ఉత్సాహంగా ఉన్నారు. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో విజయ్ బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్, ఒక పెద్ద సుత్తిని పట్టుకొని కనిపించారు. పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్న ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయిక.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News