Monday, December 23, 2024

‘గంజా శంకర్’ సినిమా విడుదలను నిలిపివేయాలి

- Advertisement -
- Advertisement -

హోం, సినిమాటోగ్రఫీ సెక్రటరీ జితేంద్రకు వినతిపత్రం అందించిన రాష్ట్ర జవహర్ బాల్ మంచ్

మనతెలంగాణ/హైదరాబాద్:  ‘గంజా శంకర్’ సినిమా మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర జవహర్ బాల్ మంచ్ డిమాండ్ చేసింది. సాయి ధర్మ తేజ హీరోగా, సందీప్ నంది దర్శకత్వంలో ఇటీవల విడుదలైన ‘గంజా శంకర్’ టీజర్ డ్రగ్స్ యువతను ప్రేరేపించే విధంగా ఉందని తక్షణమే ఈ సినిమా డైరెక్టర్ మీద చర్యలు తీసుకోవాలని రాష్ట్ర జవహర్ బాల్ మంచ్ రాష్ట్ర చైర్మన్ మామిడి రిషికేశ్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ జిల్లా చైర్మన్ విధుర్ చావల డిమాండ్ చేస్తూ రాష్ట్ర హోం, సినిమాటోగ్రఫీ సెక్రటరీ జితేంద్రకు వినతి పత్రాన్ని అందించారు.

ముఖ్యంగా 17 సంవత్సరాల వయస్సు లోపు వారు మాదకద్రవ్యాల వాడకానికి బానిసలుగా ఉన్నారంటే ‘గంజా శంకర్’ లాంటి సినిమాలు ప్రభావమే ఉంటుందని రిషికేష్ రెడ్డి ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే గంజా శంకర్ సినిమా విడుదలను నిలిపివేయాలని రిషికేశ్ రెడ్డి డిమాండ్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News