Sunday, May 11, 2025

డబ్బు మదానికి గుణపాఠం చెప్పాలి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: డబ్బు కట్టలతో.. అహంకారంతో రాజీకీయాలు చేయాలనుకునే వారికి తగిన బుద్ధి చెప్పాలని ముఖ్యమంత్రి, జాతీయ అధ్యక్షుడు కెసి ఆర్ పిలుపునిచ్చారు. పాలేరు ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ పరోక్షంగా ఇటీవల బిఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని తీవ్రంగా విమర్శించారు. నాలుగు పైరవీలు, నాలుగు కాంట్రాక్టులు చేసుకొని వచ్చిన డబ్బు మదంతో బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలను అసెంబ్లీ వాకిలిలో అడుగుపెట్టనివ్వనని మాట్లాడుతున్నారని మీరంతా తల్చుకుంటే ఎవ్వరు తొక్కుతారు వాకిలి? మీరు అనుకుంటే దుమ్ములేవదా? ఉపేందర్ రెడ్డి గెలువడా అన్నారు. ఉంది కాదా.. చేయగలమని కాని డబ్బుతో ప్రజాస్వామ్యాన్ని,ప్రజలను కోనగలరా.. ఇది రాజకీయమా ఇదే డబ్బు అహంకారంతో పాలేరులో నిలబడాలని చూస్తున్నారని, పార్టీలు మార్చే వారికి అవకాశం ఇస్తే వాళ్లు గెలుస్తరు.. కానీ ప్రజలు గెలువరన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News