Monday, January 20, 2025

గిరిజన గురుకులాల్లో పార్ట్ టైం ఉపాధ్యాయుల భర్తీ 30 నుంచి జూలై 5 వరకు గడువు

- Advertisement -
- Advertisement -
  • మెదక్ అదనపు కలెక్టర్ రమేష్

మెదక్: జిల్లాలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో పూర్తి తాత్కాలిక పద్ధతిన పార్ట్‌టైం ఉపాధ్యాయుల సేవలను 2023-/24 విద్యా సంవత్సరం వినియోగించుటకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు మెదక్ అదనపు కలెక్టర్ రమేష్ తెలిపారు. 30 నుంచి జూలై 5 వరకు దరకాస్తులను మెదక్ పట్టణంలోని మినీ గురుకులంలో ప్రాంతీయ సమన్వయకర్త కార్యాలయంలో పనిదినములలో సమర్పించాలని సూచించారు. బాలికల పాఠశాలల్లో మహిళలు మాత్రమే అర్హులని వివరించారు. పిజి, బిఈడితోపాటు టెట్ అర్హులని తెలిపారు. బాలికల జూనియర్ కళాశాల విభాగానికి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటని, జువాలజి, సివిక్స్, ఎకానామిక్స్, తెలుగు, ఆంగ్లం, గణితం, పాఠశాల విభాగానికి తెలుగు, ఇంగ్లీష్, గణితం, ఫిజిక్స్, సాంఘీకశాస్త్రం, పిఈటీ కొరకు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. బాలుర జూనియర్ కళాశాల విభాగానికి తెలుగు, ఇంగ్లీష్, గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటని, జువాలజీ, పిజి, బిఈడిలో సెకండ్ డివిజన్‌లో ఉత్తీర్ణులవ్వాలన్నారు. ఉపాధ్యాయుల ఎంపిక పూర్తి పారదర్శకంగా డెమో, మెరిట్ ఆధారంగా పూర్తి చేస్తామన్నారు. ఆంగ్ల మాధ్యమంలో బోధన చేయాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News