Monday, January 20, 2025

సమస్యలు పరిష్కరించాలని స్పీకర్‌కు ఈ పంచాయతీ ఆపరేటర్ల వినతి

- Advertisement -
- Advertisement -

బాన్సువాడ: గత 8 సంవత్సరాలుగా ఈ పంచాతీ కంప్యూటర్ ఆపరేటర్లుగా ఒక్కొక్క ఆపరేటర్ 8 నుంచి 10 గ్రామ పంచాయతీలకు పై రాష్ట్రంలో మొత్తం 12769 గ్రామ పంచాయతీలకు సంబంధించి పనులు చేస్తున్నామని కంప్యూటర్ ఆపరేటర్లు మంగళవారం స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రాన్ని సమర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పల్లె ప్రగతి, హరితహారం, జనన, మరణ ధృవీకరణ పత్రాలు, ఆస్థి మార్పిడి, భవన నిర్మాణం, వ్యాపార లైసెన్సులు, ఈ గ్రామ్ స్వరాజ్, ఆస్తుల జియో ట్యాగ్ తదితర పనులు చేస్తున్నామని, 11 రకాల అప్లికేషన్లు, ఆదాయ వ్యయాలను ఎప్పటికప్పుడు కంప్యూటరీకరణ చేస్తున్నామన్నారు. 2019 సాధారణ ఎన్నికల్లో ఎలక్షన్ విధులు నిర్వహించామన్నారు.ఫలితాలతో దేశంలోనే మన రాష్ట్రం రెండు సార్లు ఈ పంచాయతీ పురస్కార్ అవార్డు రావడంలో మా పాత్ర కూడా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 8 సంవత్సరాలుగా 1140 మంది ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లు ఒకే రకమైన పనిచేస్తున్నామన్నారు. థర్డ్ కేటగిరిలో పనిచేస్తున్న మా అందరికి రూ. 22750 కనీస వేతనం పే స్కేలు రూపంలో ట్రెజరరీ ద్వారా ఇస్తూ, ప్రసూతి సెలవులు, పీఎఫ్, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నామన్నారు. ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్లి పరిష్కరించి, ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు తాటి శంకర్‌తో పాటు ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లు, తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News