Thursday, January 23, 2025

అమరవీరుల త్యాగ ఫలితమే తెలంగాణ ఏర్పాటుకు మూలం

- Advertisement -
- Advertisement -

నారాయణపేట  : అమరవీరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మూలమని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం అమరవీరులకు నివాళి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కార్యాల యంలో జరిగిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మయాంక్ మిట్టల్ ఆధ్వర్యంలో అమరవీరు ల స్థూపానికి ఘనంగా నివాళులర్పించారు. రె ండు నిమిషాలు మౌనం పాటించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా చివరి రోజు తెలంగాణ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ అమరుల త్యాగాలను గుర్తు చేస్తూ అమరుల స్థూపంకు నివాళులర్పించామని తెలిపారు. ఈ సమావేశంలో అదికారులు గోవిందారాజన్, కన్యాకుమారి, రషీద్, కలెక్టరేట్ ఏఓ నర్సింగరావు, పిఏ నాగేంద్ర ప్రసాద్, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News